News October 19, 2025
కృష్ణ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడులు.. UPDATE

NRPT జిల్లా రాష్ట్ర సరిహద్దులోని కృష్ణ ఆర్టీవో చెక్‌పోస్ట్‌పై ACB అధికారులు మధ్య రాత్రి దాడులు చేశారు. అధికారులు తనిఖీల సమయంలో కార్యాలయంలో విద్యుత్ లైట్లను ఆఫ్ చేసి, టార్చ్‌లైట్ల సహాయంతో సోదాలు జరిపారని సమాచారం. ఆ సమయంలో మోటార్ వెహికల్ అధికారి ప్రవీణ్ విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో లెక్క చూపని నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అవినీతి ఫిర్యాదుల నేపథ్యంలో దాడులు చేసినట్లు తెలుస్తోంది.
Similar News
News October 21, 2025
డీజే ఓ నిశ్శబ్ద హంతకి

పట్టణం, పల్లెలో డీజే శబ్దాలు హోరెత్తిస్తున్నాయి. శబ్ద తీవ్రత 50 డేసిబెల్స్ దాటితే మానవులకు గుండె సంబంధిత జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నియమాలను నిర్వాహకులు పెడచెవిన పెట్టి పెద్ద శబ్దాలకు 100 డేసిబెల్స్ పెంచి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ నెల16న నరసన్నపేటలోని <<18018296>>భవానిపురంలో<<>> గౌరమ్మ ఊరేగింపులో డీజే శబ్దానికి భవనం కూలి పలువురు గాయపడిన సంగతి తెలిసిందే.
News October 21, 2025
మెట్ట ప్రాంతంలో భూగర్భ జలాల స్థాయిని పెంచాలి: కలెక్టర్

జిల్లాలో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్‌లో మంగళవారం మైనర్ ఇరిగేషన్ చెరువుల మరమ్మతులు, పునరుద్దరణ, తదితర అంశాలపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ముఖ్యంగా మెట్ట ప్రాంతాలలో భూగర్భ జలాల స్థాయి తక్కువగా ఉందని, భూగర్భ జలాల స్థాయిని గణనీయంగా పెంచేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
News October 21, 2025
వాటర్ గ్రిడ్ పైపులపై నివేదికను అందించాలి: కలెక్టర్

మంచినీటి సరఫరా పథకానికి సంబంధించిన ధవళేశ్వరం వద్ద నుంచి కోనసీమ ప్రాంతానికి వాటర్ పైపుల ఏర్పాటుకు నివేదిక సమర్పించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సంబంధిత అధికారులు ఆదేశించారు. మంగళవారం అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులను ఈ పథకంపై దిశా నిర్దేశం చేశారు. రూ.1650 కోట్ల రూపాయలతో జలజీవన్ మిషన్ పథకంలో పనులు చేపట్టామన్నారు.