News October 19, 2025

పోలీసు స్టేషన్‌లను తనిఖీ చేసిన ఎస్పీ

image

SP సతీష్ కుమార్ శనివారం రాత్రి పుట్టపర్తి అర్బన్, బుక్కపట్నం, కొత్తచెరువు ఆఫ్ గ్రేడ్ పోలీస్ స్టేషన్లతో పాటు జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరాల నియంత్రణ, అక్రమ రవాణా, ప్రజల భద్రత, అసాంఘిక కార్యకలాపాలు పూర్తిగా అరికట్టే దిశగా దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. రాత్రిపూట పోలీసుల గస్తీ, పెట్రోలింగ్, తనిఖీలు చేస్తున్నారా అని స్వయంగా పరిశీలించడానికి తనిఖీలు చేపట్టామన్నారు.

Similar News

News October 19, 2025

జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన NZB కలెక్టర్

image

దీపావళి పండుగను పురస్కరించుకుని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాల కారుచీకట్లు తొలగిపోయి, చిరుదివ్వెల వెలుగుల వలే అనునిత్యం సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. దీపావళి పండుగను ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకోవాలని అభిలషించారు.

News October 19, 2025

నయా నరకాసురులకు గుణపాఠం చెప్పాలి: పవన్

image

AP: ప్రజలకు Dy.CM పవన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ‘చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి. ఆ స్ఫూర్తితో నయా నరకాసురులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలు ఓడించారు. ఆ అక్కసుతో మారీచుల్లాంటి ఈ నరకాసురులు రూపాలు మార్చుకుంటూ ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారు. వీరికి గుణపాఠం చెప్పాలి. ఆడపడుచులు సత్యభామ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి’ అని ట్వీట్ చేశారు.

News October 19, 2025

సూర్యాపేట: చెరువులో పడి యువకుడి మృతి

image

మోతె మండలం మామిళ్లగూడెంలో ఓ యువకుడు చెరువులో జారిపడి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జూలకంటి సురేందర్ రెడ్డి (34) శనివారం రాత్రి చెరువు వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తూ అందులో పడి చనిపోయాడు. సురేందర్ రెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.