News October 19, 2025
WGL: ఆసక్తి గలవారు వేసేశారు.. మిగిలింది ఎవరు.?

ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే మద్యం వ్యాపారులు, కొత్తగా చేయాలనే వారు టెండర్ వేసేశారు. ఇక మిగిలింది ఎవరనే ప్రశ్న మొదలైంది. లైసెన్స్ దక్కించున్నాక వ్యాపారుల కష్టాలు అన్నీ ఇన్ని కావని చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రూ.3 లక్షల ఫీజు చేసింది. ఏడాది ఫీజులో నగరాలకు రూ.10 లక్షలకు పెంచింది. ఇక ఏడాదికి రూరల్‌కు రూ.5.50 కోట్లు, అర్బన్‌కు రూ.8.50 కోట్లు అమ్మితే 20 శాతం కోటా పూర్తయితే 10 శాతం కమీషన్ ఇస్తారు.
Similar News
News October 21, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. అసంతృప్తుల నామినేషన్..!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. ముఖ్యంగా ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న పలువురు నామినేషన్ వేసి సర్కారుపై తిరుగుబావుటా ఎగురవేశారు. ఫార్మాసిటీ బాధితులు, RRR బాధితులు, మాల మహానాడు నాయకులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ నాయకులు, నిరుద్యోగ యువత ఈరోజు షేక్‌పేట్‌లోని నామినేషన్ సెంటర్‌లో తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు: సత్యకుమార్ యాదవ్

AP: కిడ్నీ రోగుల కోసం రాష్ట్రంలో కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. S.కోట, భీమవరం, పీలేరు ఏరియా ఆసుపత్రులలో, సీతంపేట, వెంకటగిరి, అద్దంకి, సున్నిపెంట సీహెచ్సీల్లో ఇవి ఏర్పాటవుతాయని వివరించారు. వీటిలో రోజూ 3 సెషన్లలో 15 మంది చొప్పున రోగులకు రక్తశుద్ధి జరుగుతుందన్నారు. PMNDP కింద ఒక్కో కేంద్రంలో ₹75 లక్షలతో యంత్రాలు, పరికరాలు సమకూరుతాయని తెలిపారు.