News October 19, 2025
కరీంనగర్: కానిస్టేబుల్ నుంచి డిప్యూటీ MRO వరకు

కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తోకల శైలుకిరణ్ తాజాగా విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో ప్రతిభ కనబరచి డిప్యూటీ MROగా ఎంపికయ్యారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు కష్టపడి చదువుతూ లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్రిపరేషన్ సమయంలో తండ్రి మరణించినా ధైర్యంగా చదువును కొనసాగించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో నియామకపత్రం అందుకున్నారు.
Similar News
News October 21, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. అసంతృప్తుల నామినేషన్..!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. ముఖ్యంగా ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న పలువురు నామినేషన్ వేసి సర్కారుపై తిరుగుబావుటా ఎగురవేశారు. ఫార్మాసిటీ బాధితులు, RRR బాధితులు, మాల మహానాడు నాయకులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ నాయకులు, నిరుద్యోగ యువత ఈరోజు షేక్‌పేట్‌లోని నామినేషన్ సెంటర్‌లో తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు: సత్యకుమార్ యాదవ్

AP: కిడ్నీ రోగుల కోసం రాష్ట్రంలో కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. S.కోట, భీమవరం, పీలేరు ఏరియా ఆసుపత్రులలో, సీతంపేట, వెంకటగిరి, అద్దంకి, సున్నిపెంట సీహెచ్సీల్లో ఇవి ఏర్పాటవుతాయని వివరించారు. వీటిలో రోజూ 3 సెషన్లలో 15 మంది చొప్పున రోగులకు రక్తశుద్ధి జరుగుతుందన్నారు. PMNDP కింద ఒక్కో కేంద్రంలో ₹75 లక్షలతో యంత్రాలు, పరికరాలు సమకూరుతాయని తెలిపారు.