News October 19, 2025

21న ‘మూరత్ ట్రేడింగ్’.. ఈ ఏడాది మారిన టైమింగ్

image

దీపావళి సందర్భంగా ఈ నెల 21న ప్రత్యేక ‘మూరత్ ట్రేడింగ్’ జరగనుంది. మధ్యాహ్నం 1.45 నుంచి 2.45 గంటల వరకు నిర్వహించనున్నట్లు BSE, NSE ప్రకటించాయి. ప్రతిఏటా సాయంత్రం పూట ఈ సెషన్ జరిగేది. అయితే ఈ సారి సంప్రదాయానికి భిన్నంగా మధ్యాహ్నం నిర్వహించనున్నారు. లక్ష్మీ పూజను పురస్కరించుకొని గంటపాటు జరిగే ఈ ట్రేడింగ్‌లో ఒక్క షేర్ అయినా కొనాలని ఇన్వెస్టర్లు భావిస్తారు. కాగా 21, 22 తేదీల్లో స్టాక్ మార్కెట్లకు సెలవు.

Similar News

News October 19, 2025

మామిడిలో ఇనుపధాతు లోపం – నివారణ

image

మామిడిలో ఇనుపధాతులోప సమస్య ఉన్న చెట్ల ఆకులు పచ్చదనం కోల్పోయి తెల్లగా పాలిపోతాయి. ఆకుల సైజు తగ్గిపోతుంది. సమస్య తీవ్రత పెరిగితే మొక్కల ఆకులు పైనుంచి కిందకు ఎండిపోతాయి. ఇనుపధాతు లోపం సున్నపురాయి ఉన్న నేలల్లో సాధారణంగా కనిపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి 2.5 గ్రా అన్నబేధి+1 గ్రా. నిమ్మఉప్పు లేదా ఒక బద్ద నిమ్మకాయ రసం కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు చెట్టుపై పిచికారీ చేయాలి.

News October 19, 2025

తొలి మహిళా సీఎం సుచేతా కృపలాని

image

స్వాతంత్ర్య సమరయోధురాలు సుచేతా కృపలాని దేశంలోనే తొలి మహిళా CMగా బాధ్యతలు చేపట్టి చరిత్రలో నిలిచారు. 1908లో పంజాబ్‌లోని జన్మించిన ఆమె బెనారస్ యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా పనిచేశారు. 1936లో ప్రొఫెసర్ కృపలానీని మ్యారేజ్ చేసుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకెళ్లారు. స్వాతంత్య్రం తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి లోక్‌సభ, శాసనసభలకు ప్రాతినిధ్యం వహించారు. 1963లో UP CMగా ఎన్నికై చరిత్ర సృష్టించారు.

News October 19, 2025

నయా నరకాసురులకు గుణపాఠం చెప్పాలి: పవన్

image

AP: ప్రజలకు Dy.CM పవన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ‘చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి. ఆ స్ఫూర్తితో నయా నరకాసురులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలు ఓడించారు. ఆ అక్కసుతో మారీచుల్లాంటి ఈ నరకాసురులు రూపాలు మార్చుకుంటూ ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారు. వీరికి గుణపాఠం చెప్పాలి. ఆడపడుచులు సత్యభామ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి’ అని ట్వీట్ చేశారు.