News October 19, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తగ్గిన మద్యం దరఖాస్తులు

2023తో పోలిస్తే జిల్లాలో ఈ సంవత్సరంలో 709 దరఖాస్తులు తగ్గాయి. SEP 26న మద్యం టెండర్ల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఈనెల 18 నాటికి అంచనాలను తారుమారు చేస్తూ తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో 2023లో మద్యం దుకాణాలకు 2033 దరఖాస్తులు రాగా.. ఈ సంవత్సరం నిన్నటి వరకు 1324 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈ సంవత్సరం దరఖాస్తులు తగ్గడంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా భారీగా తగ్గుతుందని విశ్లేషకులు అంచనా వేశారు.
Similar News
News October 19, 2025
కాకినాడ: రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు

దీపావళి పర్వదినం సందర్భంగా ఈ నెల 20వ తేదీ (సోమవారం) నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం జరిగే ఈ కార్యక్రమం రద్దయిన విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. అలాగే ప్రజలందరీ ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
News October 19, 2025
తొలి మహిళా సీఎం సుచేతా కృపలాని

స్వాతంత్ర్య సమరయోధురాలు సుచేతా కృపలాని దేశంలోనే తొలి మహిళా CMగా బాధ్యతలు చేపట్టి చరిత్రలో నిలిచారు. 1908లో పంజాబ్‌లోని జన్మించిన ఆమె బెనారస్ యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా పనిచేశారు. 1936లో ప్రొఫెసర్ కృపలానీని మ్యారేజ్ చేసుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకెళ్లారు. స్వాతంత్య్రం తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి లోక్‌సభ, శాసనసభలకు ప్రాతినిధ్యం వహించారు. 1963లో UP CMగా ఎన్నికై చరిత్ర సృష్టించారు.
News October 19, 2025
దీపావళి దివ్యకాంతులు అందరికీ ఆనందాన్ని తేవాలి: కలెక్టర్

దీపావళి పండుగ సందర్భంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రజలకు కలెక్టర్ మహేశ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి దివ్య కాంతులు అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని తేవాలని ఆకాంక్షించారు. చీకటిపై కాంతి, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి దీపావళి సంకేతంగా నిలుస్తుందన్నారు. జీవితమంటే చీకటి వెలుగుల సమన్వయమేనని దీపావళి నేర్పే పాఠమని కలెక్టర్ పేర్కొన్నారు.