News October 19, 2025
HYD: దీపావళి వేళ.. గుర్తుంచుకోండి ఈ నంబర్లు

దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాలుస్తాం.. ఒక్కోసారి అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయి. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడా ఎలాంటి ప్రమాదాలు జరిగినా అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వాలని ఆ శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ కోరారు. 24 గంటల పాటు సిబ్బంది విధి నిర్వహణలో ఉంటారని పేర్కొన్నారు. ఫైర్ యాక్సిడెంట్లకు సంబంధించి 101, 112, 9949991101 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందివ్వాలని కోరారు.
Similar News
News October 21, 2025
HYD: సరోజినీ దేవి ఆస్పత్రికి క్యూకట్టిన బాధితులు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దీపావళి సందర్భంగా టపాసుల మోత మోగించారు. దీంతో బాణసంచా బాధితులతో సరోజినీ దేవి ఆస్పత్రి నిండిపోయింది. నిర్లక్ష్యంగా టపాసులు కాల్చడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సరోజినీ దేవి హాస్పిటల్‌లో సుమారు 70 మంది బాధితులు కాలిన గాయాలతో చేరారు. గాయపడిన వారిలో 20 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం.
News October 21, 2025
REWIND 2023 పోల్.. జూబ్లీహిల్స్‌లో 1,374 మంది నోటాకు ఓటేశారు!

2023 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసిన 19 మందిని 1,374 మంది ఓటర్లు తిరస్కరించారు. అంటే వీరంతా NOTA (None of The Above)కు ఓటు వేశారన్న మాట. ఇదిలా ఉండగా వెయ్యి ఓట్లలోపు ఇద్దరు అభ్యర్థులు సాధించగా 500లోపు ఇద్దరు, 200లోపు ఆరుగురు, ఐదుగురు 100లోపు ఓట్లు సాధించారు. ఆనందరావు అనే ఇండిపెండెంట్ అభ్యర్థి 53 ఓట్లతో చివరి స్థానంలో నిలిచారు.
News October 21, 2025
సికింద్రాబాద్: ఆ ట్రైన్ తాత్కాలికంగా రద్దు

సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే అధికారులు గోరఖ్‌పుర్ ట్రైన్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నగరం నుంచి గోరఖ్‌పుర్‌కు వీక్లీ ట్రైన్ ప్రయాణికులకు సేవలందించేది. అయితే నవంబర్ 28 నుంచి జనవరి 4వ తేదీ వరకు ఈ రైలు (07075- 07076)ను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు ఈ విషయం గమనించి సహకరించాలని కోరారు.