News October 19, 2025
జూబ్లీహిల్స్: 8 పోలీస్ స్టేషన్లు.. 234 ఆయుధాలు

జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో 234 మంది వద్ద లైసెన్డ్స్ ఆయుధాలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా వాటిని స్థానిక PSలలో డిపాజిట్ చేయాలి. అయితే ఇప్పటి వరకు 196 మంది తుపాకులను పోలీసులకు అందజేశారు. పంజాగుట్ట PS పరిధిలో 26 ఉండగా 19, మధురానగర్‌లో 23 ఉండగా 17, బోరబండలో 37కు 27, జూబ్లీహిల్స్‌లో 27కు 23, ఫిలింనగర్‌లో 6కు 5, టోలిచౌకిలో 106కు 96, సనత్‌నగర్‌లో 2కు 2, గోల్కోండ పరిధిలో 7ఉండగా 7 ఆయుధాలను అప్పగించారు.
Similar News
News October 21, 2025
HYD: సరోజినీ దేవి ఆస్పత్రికి క్యూకట్టిన బాధితులు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దీపావళి సందర్భంగా టపాసుల మోత మోగించారు. దీంతో బాణసంచా బాధితులతో సరోజినీ దేవి ఆస్పత్రి నిండిపోయింది. నిర్లక్ష్యంగా టపాసులు కాల్చడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సరోజినీ దేవి హాస్పిటల్‌లో సుమారు 70 మంది బాధితులు కాలిన గాయాలతో చేరారు. గాయపడిన వారిలో 20 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం.

ASF: ‘ప్రతి ఉద్యోగి వివరాలు నమోదు చేసుకోవాలి’

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు ASF జిల్లాలో పనిచేసే ప్రతి ఉద్యోగి పోర్టల్‌లోని హెచ్ఆర్ మాడ్యూల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా ఖజానా శాఖ సహాయ సంచాలకురాలు భానుమతి తెలిపారు. ప్రతి ఉద్యోగి ఆధార్, పాన్, ఫోన్ నంబర్ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. నమోదు చేసుకోనట్లయితే డీడీఓలకు అక్టోబర్ నెలకు సంబంధించిన వేతనాల బిల్లులు రావని, ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ఓపెన్ కాదన్నారు.