News October 19, 2025

బల్మూరు: వినాయకుడి విగ్రహం ధ్వంసం

image

మండలంలోని బాణాల గ్రామంలో వినాయకుడి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు రాత్రి ధ్వంసం చేశారు. మూడు రోజుల క్రితం హనుమాన్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలిస్తారని బీజేపీ నాయకులు తెలిపారు.

Similar News

News October 21, 2025

జూబ్లీహిల్స్: బీజేపీ ర్యాలీలో టీడీపీ జెండాలు..!

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీ ఈరోజు భారీగా జరిగింది. అయితే ర్యాలీలో బీజేపీ జెండాలతోపాటు టీడీపీ జెండాలు కూడా దర్శనమిచ్చాయి. పలువురు కార్యకర్తలు టీడీపీ జెండాలు చేతపట్టి ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఆంధ్రలో కూటమిలో భాగమైన బీజేపీ, టీడీపీ, జనేసేన కార్యకర్తలు పాల్గొని లంకల దీపక్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని నేతలు పిలుపునిచ్చారు.

News October 21, 2025

పాడేరు: ‘పెండింగ్‌లో భూ సమస్యలను తక్షణం పరిష్కరించాలి’

image

పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న భూ సంబంధిత రీసర్వేలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. అన్నదాత సుఖీభవ పథకంలో పెండింగ్‌లోని దరఖాస్తు మ్యుటేషన్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.