News October 19, 2025

ములుగు: మావోయిస్టు పార్టీకి పెద్ద సవాళ్లు!

image

వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ పెద్ద సవాళ్లు ఎదుర్కొంటోంది. నక్సలైట్ సంస్థ నడిపే పొలిట్ బ్యూరో కూడా దాదాపు ఖాళీగానే ఉంది. పోలీట్ బ్యూరో కేంద్ర కమిటీలో ఒకప్పుడు 17 మందికి పైగా సభ్యులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 8 మంది కంటే తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలిట్ బ్యూరోలో మిసిర్ బెస్రా, తిరుపతి@దేవ్ జీ, గణపతి, సీసీ కమిటీ సభ్యులు మాడవి హిడ్మా, రామన్న, గణేశ్, ఉదయ్ ఉన్నారు.

Similar News

News October 21, 2025

పాలమూరు వర్శిటీ.. దేశవ్యాప్తంగా వినిపించాలి:VC

image

పాలమూరు వర్శిటీ పేరు దేశవ్యాప్తంగా వినిపించేలా పథకాలు సాధించాలని వర్శిటీ ఉపకులపతి ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆర్చరీ పురుషుల జట్టుకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. సౌత్ జోన్(ఆల్ ఇండియా ఇంటర్ వర్శిటీ) టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఆర్చరీ జట్టు గురుకాసి వర్శిటీ పంజాబ్‌కు బయలుదేరారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.రమేష్ బాబు, అసోసియేట్ ప్రొ.డాక్టర్ ఎన్.కిషోర్,PD శ్రీనివాసులు పాల్గొన్నారు.

News October 21, 2025

రైతు సంక్షేమంపై దృష్టి సారించండి: కలెక్టర్

image

వ్యవసాయ సహాయక శాఖల పనితీరు, రైతులకు అందిస్తున్న సేవలపై కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మంగళవారం మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో అగ్రికల్చర్ అల్లయిడ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయ, పశుసంవర్ధక, పాల, మత్స్య, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. రైతులకు సమయానికి విత్తనాలు, ఎరువులు, సబ్సిడీ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

News October 21, 2025

చేత్తో తినాలా.. స్పూన్‌తోనా.. ఏది సేఫ్?

image

విదేశీ కల్చర్‌కు అలవాటు పడి చాలామంది స్పూన్‌తో తింటుంటారు. అదే సేఫ్ అని భావిస్తుంటారు. కానీ అది అపోహేనని రీసెంట్ స్టడీస్ తేల్చాయి. ‘చేత్తో తింటే గాలి తక్కువగా లోనికి వెళ్లి గ్యాస్ సమస్య తగ్గుతుంది. అలానే అన్నం-కూర బ్యాలెన్స్, మెంటల్ హెల్త్, సహజత్వం, టైమ్ మేనేజ్మెంట్, ఫీల్, ఫుడ్ సేఫ్టీ వంటి ప్రయోజనాలు ఉన్నాయి’ అని పరిశోధకులు చెబుతున్నారు. ఇది మన భారతీయ సంప్రదాయమని కొందరు అంటున్నారు. మరి మీరేమంటారు?