News October 19, 2025
నేడు వేములవాడ రాజన్న దర్శనాలపై క్లారిటీ..?

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఈరోజు సాయంత్రం 5 గంటలకు శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామి వస్తున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరుకానున్నారు. ఈ రోజు సాయంత్రం రాజన్న దర్శనంపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొద్దిరోజులుగా రాజన్న దర్శనాలపై సందిగ్ధత నెలకొంటున్న విషయం తెలిసిందే.
Similar News
News October 19, 2025
దీపావళి సందర్భంగా విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

దీపావళి సందర్భంగా విజయవాడ మీదుగా చెన్నై ఎగ్మోర్(MS), సంత్రాగచ్చి(SRC) మధ్య స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.06109 MS-SRC రైలును నేడు ఆదివారం, నం.06110 SRC-MS రైలును రేపు సోమవారం నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు విజయవాడతో పాటు సూళ్లూరుపేట, గూడూరు, ఒంగోలు, నెల్లూరు, తెనాలి, ఏలూరు, రాజమండ్రి, శ్రీకాకుళంతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
News October 19, 2025
16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: లోకేశ్

గత 16 నెలల్లో ఏ రాష్ట్రానికి రాని విధంగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ నినాదం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. దేశంలో చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్నాయి. ఒక్క APలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది’ అని AUSలో తెలుగు డయాస్పోరా సమావేశంలో తెలిపారు.
News October 19, 2025
KNR: కర్తవ్య భవన్‌లోకి మారిన బండి సంజయ్ ఆఫీస్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన శాఖ కార్యాలయంను కర్తవ్య భవన్‌లోకి మార్చారు. సెంట్రల్ విస్టా రీ-డెవలెప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా నూతనంగా నిర్మించిన కామన్ సెంట్రల్ సచివాలయాన్ని ప్రధాని AUG 6న ప్రారంభించారు. కాగా, దీపావళిని పురస్కరించుకొని నేడు మంచి మహూర్తం ఉండటంతో అర్చకుల వేద మంత్రోచ్చారణల నడుమ కర్తవ్య భవన్‌లోకి మంత్రి అడుగుపెట్టారు. ప్రత్యేక పూజలు చేసి తనకు కేటాయించిన సీట్లో ఆశీసునలయ్యారు.