News October 19, 2025
జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ప్రకటించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వర్షంతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సురక్షిత ప్రాంతాలలో రక్షణ పొందాలని సూచించారు.
Similar News
News October 19, 2025
పేకాట ఆడితే చర్యలు తప్పవు: కామారెడ్డి ఎస్పీ

పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడినందుకు ఇప్పటికే 39 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వారి నుంచి రూ.79,300 నగదు, 29 మొబైల్స్, 9 మోటర్ సైకిల్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
News October 19, 2025
జిల్లాలో 287 ధాన్యం కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్

జనగామ: ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేందుకు జిల్లా వ్యాప్తంగా 287 కేంద్రాలు ఏర్పాటు చేశామని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు పక్కా కార్యాచరణ అమలు చేయాలని, అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన ఆదేశించారు. ఇప్పటివరకు 592 మె.ట ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. రైతులకు చెల్లింపులు త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
News October 19, 2025
ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయి: సీఎం

తెలంగాణ ప్రజలకు CM రేవంత్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రెండేళ్ల ప్రజాపాలనలో ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయని తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ వెలుగుల పండుగను రాష్ట్రంలోని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని చెప్పారు. పర్యావరణానికి హాని కలిగించకుండా ఆనందంగా పండుగ జరుపుకోవాలని, ప్రమాదాలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.