News October 19, 2025

జనగామ: కపాస్ కిసాన్ యాప్‌ను వినియోగించాలి: డీఏఓ

image

పత్తి పంటను సాగు చేసిన రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో సాగు చేసిన పంట విస్తీర్ణం వివరాలను నమోదు చేసుకోవాలని జనగామ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని అంబికా సోని తెలిపారు. ఈ యాప్‌లో వివరాలు నమోదు చేసుకున్న రైతులకు పత్తి విక్రయాల్లో పారదర్శకత ఉంటుందని స్పష్టం చేశారు. కావున రైతులు ఈ యాప్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News October 19, 2025

పేకాట ఆడితే చర్యలు తప్పవు: కామారెడ్డి ఎస్పీ

image

పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడినందుకు ఇప్పటికే 39 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వారి నుంచి రూ.79,300 నగదు, 29 మొబైల్స్, 9 మోటర్ సైకిల్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

News October 19, 2025

జిల్లాలో 287 ధాన్యం కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్‌

image

జనగామ: ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేందుకు జిల్లా వ్యాప్తంగా 287 కేంద్రాలు ఏర్పాటు చేశామని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు పక్కా కార్యాచరణ అమలు చేయాలని, అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన ఆదేశించారు. ఇప్పటివరకు 592 మె.ట ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. రైతులకు చెల్లింపులు త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

News October 19, 2025

ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయి: సీఎం

image

తెలంగాణ ప్రజలకు CM రేవంత్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రెండేళ్ల ప్రజాపాలనలో ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయని తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ వెలుగుల పండుగను రాష్ట్రంలోని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని చెప్పారు. పర్యావరణానికి హాని కలిగించకుండా ఆనందంగా పండుగ జరుపుకోవాలని, ప్రమాదాలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.