News October 19, 2025
HYD: మంత్రి పేషీ అడ్డాగా ఐటీ ప్రాజెక్ట్ పేరుతో మోసం

సచివాలయం ఐటీ మంత్రి పేచీ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మంత్రి పేషీని అడ్డాగా చేసుకొని ఐటీ ప్రాజెక్ట్ మంజూరు చేస్తామంటూ మోసం చేశారు. మియాపూర్ ఐటీ ఇంజినీర్‌ను లక్ష్యంగా చేసుకుని నకిలీ పత్రాలతో రూ.1.77 కోట్లు కాజేశారు. మంత్రి ఓఎస్‌డీ లెటర్‌హెడ్‌లు, నకిలీ పత్రాలు చూపి మోసగాళ్లు నమ్మించారు. బాధితుడి ఫిర్యాదుతో ఆరిగురిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణను సీసీఎస్‌కు బదిలీ చేశారు.
Similar News
News October 19, 2025
PDPL: ‘మట్టి మనుషులకు’ దీపావళి ‘కాంతినిద్దాం’

కుమ్మరులు.. వీరు లేనిదే ఏ ఇంట్లో శుభకార్యం జరగదనడంలో అతిశయోక్తి లేదు. వీరుచేసే ప్రమిదలు, రంజన్లు, ముఖ్యంగా పెళ్లి కుండలు హైందవుల పండగల్లో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే ప్రస్తుతం ఆన్లైన్లో, సూపర్ మార్కెట్లలో వీటిని కొంటున్నారు. ఈసారైనా అక్కడ కాకుండా మన ఇంటి పరిసరాల్లో షాపులు ఏర్పాటు చేసుకునే చిన్న వ్యాపారులు, కుమ్మరుల వద్ద కొందాం. వారికి ఉపాధిని కల్పించి నిజమైన దీపావళి కాంతిని అందిద్దాం. SHARE IT.
News October 19, 2025
టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలి: ఎస్పీ

దీపావళి పండుగ సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. అధిక శబ్దం కలిగిన బాణాసంచాను కాల్చే సమయంలో తోటి వారికి ఇబ్బంది కలగకుండా కుటుంబ సభ్యులు ముందుగా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఎలాంటి అగ్ని ప్రమాదాలకు తావు లేకుండా పండుగ జరుపుకోవాలని తెలిపారు. బాణాసంచా నిల్వలు కలిగి ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.
News October 19, 2025
జాగ్రత్తగా దీపావళి జరుపుకోవాలి: ఎస్పీ రాహుల్ మీనా

దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చిన్న పిల్లలు తప్పనిసరిగా పెద్దల పర్యవేక్షణలోనే టపాసులు కాల్చాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆయన కోరారు.