News October 19, 2025

సిద్దిపేట: కాల్చకుండానే పేలుతున్న పటాకుల ధరలు !

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో దీపావళి పటాకుల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. టపాసులపై GST, కెమికల్స్ ధరలు తగ్గినా ధరలు మాత్రం దిగలేదు. చిన్నా పెద్ద తేడా లేకుండా కాల్చే కాకర పుల్లల ధరలు సైతం గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. ఒక్కో దాని కుల్ల ప్యాకెట్ ధర రూ.30 నుంచి రూ.100 వరకు పలుకుతుంది. చిచ్చుబుడ్డులు, లక్ష్మి, సుతిల్ బాంబులతో పాటు ఇతర టపాకాయలు ధరలు ఎక్కువగానే ఉన్నాయి.

Similar News

News October 19, 2025

లేగదూడను చూసి CM మురిసే!

image

యాదవుల సదర్ అంటే CM‌ రేవంత్ రెడ్డికి మక్కువ అని చెప్పడానికి ఈ ఫొటో చక్కటి ఉదాహరణ. NTR స్టేడియం వద్ద నిర్వహించిన సదర్‌లో రేవంత్ ఏ ఒక్కరినీ నిరాశ పర్చలేదు. కళాకారుల నుంచి యువత వరకు అందరినీ పలకరించారు. యాదవ సోదరులతో ఫొటోలు దిగి సంభాషించారు. వేదిక ఎక్కిన తర్వాత అందంగా అలంకరించిన ఓ లేగదూడను చూసి ఆయన ముగ్ధుడయ్యారు. ఆ దూడెను తన దగ్గరకు తీసుకోవడం సదర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

News October 19, 2025

వనపర్తి: దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు: ఎస్పీ

image

దీపావళి పండుగ వేడుకలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. అజాగ్రత్తగా టపాసులు కాల్చి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని, చిన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. టపాసులు కాల్చేటప్పుడు నీరు, ఇసుక బకెట్‌ను దగ్గర ఉంచుకోవాలని చెప్పారు. దీపావళి వెలుగులు అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఎస్పీ కోరుకున్నారు.

News October 19, 2025

భద్రాద్రి: ‘కగార్’ దెబ్బ.. కీకారణ్యం వీడి జనారణ్యంలోకి!

image

50 ఏళ్లుగా కొనసాగిన నక్సల్బరీ ఉద్యమం చర్ల సరిహద్దుల్లోని కర్రె గుట్టల్లో మొదలైన ఆపరేషన్ కగార్ దెబ్బకు క్షీణించింది. మావోయిస్టులు కీకారణ్యం వీడి జనారణ్యంలోకి కదులుతున్నారు. పెత్తందారులకు వ్యతిరేకంగా సాగిన ఈ పోరాటంలో ఎంతో మంది అసువులు బాసారు. మల్లోజుల, ఆశన్నల వంటి మావోయిస్టు అగ్ర నేతలు లొంగిపోవడంతో ఉద్యమం మరింత బలహీనపడింది. కొద్ది నెలలుగా SP రోహిత్ రాజు ఎదుట కూడా గుంపులు గుంపులుగా వచ్చి లొంగిపోయారు.