News April 8, 2024
వావ్.. ఉద్యోగుల కోసం ఇళ్లు నిర్మించనున్న యాపిల్!

భారత్‌లోని ఐఫోన్ తయారీ ప్లాంట్లలో పనిచేసే 78వేల మంది ఉద్యోగులకు ఇళ్లు నిర్మించాలని యాపిల్ సంస్థ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్ట్‌కు కొంతమేర నిధులు అందించనున్నాయి. తయారీదారులైన ఫాక్స్‌కాన్, టాటా, శాల్‌కాంప్ సంస్థల ఉద్యోగులకు ఈ ఇళ్లు నిర్మించనున్నారు. మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తున్నారట. కాగా చైనాలోనూ యాపిల్ ఇదే తరహాలో ఉద్యోగులకు ఇళ్లు నిర్మించింది.
Similar News
News March 3, 2025
కాదేదీ కథకు అనర్హం!

గతంలోని ‘కాదేదీ కవితకనర్హం’ అనే నానుడిలోకి ఇప్పుడు ‘కాదేదీ సినిమా కథకు అనర్హం’ చేరింది. గతంలో కోతి, పాము, ఏనుగు, కొండచిలువ, పులి, సింహం, కుక్క వంటి జంతువుల నేపథ్యంగా సినిమాలు వచ్చాయి. ఇటీవల ట్రెండ్ కాకులకు మారింది. మన బంధు పక్షి కోర్ టాపిక్‌గా ‘విరూపాక్ష’, కాకి ముట్టడం అనే స్టోరీ లైన్‌తో ‘దసరా, బలగం’, వస్తే ఇప్పుడు కాకుల విక్టరీ అంటూ శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’ తెరకెక్కిస్తున్నారు.
News March 3, 2025
UAEలో భారత మహిళకు మరణ శిక్ష అమలు

షెహజాదీ అనే భారత మహిళకు UAEలో ఈ నెల 15న మరణ శిక్ష అమలైంది. UPకి చెందిన ఆమెను విదేశాలకు తీసుకెళ్తానని నమ్మించిన ఓ బ్రోకర్ ఓ ముస్లిం జంటకు అమ్మేశాడు. వారు ఆమెను తమతో UAE తీసుకెళ్లి తమ బిడ్డ ఆలనాపాలనల్ని అప్పగించారు. ఆ బిడ్డ హఠాత్తుగా చనిపోవడంతో షెహజాదీపై హత్యారోపణలు మోపారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి చనిపోయిందని ఆమె వాదించినా ఆలకించని కోర్టు మరణ శిక్ష విధించింది.
News March 3, 2025
రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు..

ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు మ.2.30 గంటలకు భారత్, ఆస్ట్రేలియా మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. CT చరిత్రలో ఈ 2 పెద్ద జట్లు నాలుగు సార్లు తలపడగా రెండుసార్లు IND, ఒకసారి AUS గెలిచింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. దీంతో ఇరు జట్లూ హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నాయి. లీగ్ దశలో ఆడిన 3 మ్యాచ్‌ల్లో గెలిచి జోరు మీదున్న భారత్ ఆసీస్‌పై గెలిచి 2023 WC ఫైనల్‌లో ఓటమికి రివేంజ్ తీసుకోవాలని చూస్తోంది.
ALL THE BEST TEAM INDIA.