News October 19, 2025
పల్నాడు వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా మల్లికార్జున్రెడ్డి

పల్నాడు జిల్లా వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి నియామకాన్ని ఆదివారం ప్రకటించారు. రొంపిచర్లకి చెందిన గెల్లి మల్లికార్జున్రెడ్డి మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. తన నియామకానికి సహకరించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలకు మల్లికార్జున్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News October 19, 2025
చిన్నకోడూరు: కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలి: హరీశ్ రావు

సిద్దిపేట జిల్లా ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదివారం చిన్నకోడూరు మండలంలో మొక్కజొన్న పంటలను పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి తిట్ల మీద ఉన్న ధ్యాస పత్తి, మొక్కజొన్న రైతుల కష్టాలపై లేదన్నారు. అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను కొనుగోళ్లు ఆలస్యం చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మరింత నష్టపరుస్తుందని విమర్శించారు.
News October 19, 2025
వేములవాడకు చేరుకున్న పీఠాధిపతి..!

శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతివారు వేములవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ధర్మ విజయ యాత్రలో ఆయనను వేములవాడ MLA ఆది శ్రీనివాస్ సాదరంగా ఆహ్వానించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తజనం మంగళ హారతులతో శృంగేరి పీఠాధిపతికి ఘన స్వాగతం పలికింది. ఆయన రాకతో వేములవాడలో పండగ వాతావరణం నెలకొంది. కాగా, సుదూర ప్రాంతాల నుంచి వివిధ పార్టీలకు చెందిన నేతలూ స్వామీజీకి స్వాగతం పలికేందుకు వచ్చారు.
News October 19, 2025
గద్వాల: దీపావళి జాగ్రత్తగా జరుపుకోండి: ఎస్పీ

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రజలందరికీ ఎస్పీ శ్రీనివాసరావు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళిని సంతోషంగా, వెలుగుల పండుగగా జరుపుకోవాలని ఆయన కోరారు. బాణసంచా కాల్చేటప్పుడు తప్పనిసరిగా భద్రతా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చిన్నారులు, యువత తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే బాణసంచా కాల్చాలని, ప్రమాదకరమైన వాటిని వాడకూడదని ఎస్పీ సూచించారు.