News October 19, 2025
అనంతగిరిలో అధిక పార్కింగ్ వసూళ్లు..!

వికారాబాద్ అనంతగిరి ఆలయం పార్కింగ్‌లో భక్తుల నుంచి అధిక వసూళ్లు చేస్తున్నారని భక్తులు వాపోయారు. పార్కింగ్ నిర్వాహకులను పార్కింగ్ రుసుము ఎంత అని ప్రశ్నించగా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఒక రేటు, వీకెండ్ శని, ఆదివారాలల్లో అంతకు మించి అధిక రేట్లు తీసుకుంటామని పేర్కొన్నారు. కారు పార్కింగ్ రూ.20 అయితే రసీదు ఇచ్చి రూ.30 తీసుకున్నారని భక్తులు తెలిపారు. అధికారులు స్పందించాలని భక్తులు కోరుతున్నారు.
Similar News
News October 19, 2025
విషం తాగిన తల్లి.. కూతురు ఏం చేసిందంటే?

UP మీర్జాపూర్‌కు చెందిన ఐదేళ్ల బాలిక సమయస్ఫూర్తితో తల్లి ప్రాణాలు కాపాడుకుంది. నిన్న తన తల్లి విషం తాగడంతో శివాణి ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్ 1090కు కాల్ చేసింది. వెంటనే సమీపంలోని పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడు ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. ఎమర్జెన్సీ సమయంలో హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేయాలని స్కూల్లో చెప్పారని ఆ బాలిక చెప్పడంతో ప్రశంసలు కురుస్తున్నాయి.
News October 19, 2025
ప్రమాదం జరిగితే ఇలా చేయండి: ప్రకాశం SP

ప్రకాశం జిల్లా ప్రజలకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదివారం దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దీపావళి రోజు ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటే అత్యవసర సమయంలో ఫైర్ స్టేషన్ టోల్ ఫ్రీ నెంబర్ 101కు సమాచారం అందించాలన్నారు. అలాగే పోలీస్ డయల్ 100, 112 నెంబర్లను సైతం సంప్రదించవచ్చని తెలిపారు. కాలుష్య రహిత టపాసులను ప్రజలు కాల్చాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
News October 19, 2025
దీపావళి ఉత్సవాలు.. ఇవి గుర్తుంచుకోండి

*లైసెన్స్ పొందిన షాప్స్ నుంచే బాణసంచా కొనాలి.
*టపాకాయలు కాల్చేటప్పుడు కాటన్ వస్త్రాలు ధరించాలి. సింథటిక్ లేదా లూజ్ వస్త్రాలు ధరించవద్దు.
*పని చేయని పటాకులను మళ్లీ వెలిగించేందుకు ట్రై చేయవద్దు.
*క్రాకర్స్ వల్ల గాయమైతే ఐస్, వెన్న, ఆయింట్‌మెంట్ రాయవద్దు. 10-15 ని. పాటు శుభ్రమైన నీటితో చల్లగా ఉంచాలి.
*అత్యవసర సమయాల్లో 101 లేదా 112కి కాల్ చేయాలి.