News April 8, 2024
టీటీడీ ఈవో ధర్మారెడ్డిని తొలగించాలని ఫిర్యాదు

AP: TTD EO ధర్మారెడ్డిని తొలగించాలని కోరుతూ TDP-JSP-BJP కూటమి నేతలు CEO ముకేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. తిరుమల, తిరుపతిలో రాజకీయ ప్రచారం, అక్రమాలకు సంబంధించి పలు ఆధారాలను సమర్పించారు. ‘ధర్మారెడ్డి వల్ల టీటీడీ గౌరవ ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయి. TTDకి చెందిన రూ.5వేల కోట్ల నిధులను దారిమళ్లించారు. టీటీడీ ఛైర్మన్ తన అనుచరులకు రూ.1500 కోట్లు ఎలా విడుదల చేశారు?’ అని కూటమి నేతలు ప్రశ్నించారు.
Similar News
News March 3, 2025
జనసేనలోకి మాజీ MLA!

AP: జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం మాజీ MLA పెండెం దొరబాబు జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాసేపటి క్రితం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి పవన్‌ను కలిశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై చర్చించినట్టు సమాచారం. వారం రోజుల్లో ఆయన JSP తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో తనను కాదని వంగా గీతకు టికెట్ ఇవ్వడంతో దొరబాబు AUGలో వైసీపీకి రాజీనామా చేశారు.
News March 3, 2025
కాదేదీ కథకు అనర్హం!

గతంలోని ‘కాదేదీ కవితకనర్హం’ అనే నానుడిలోకి ఇప్పుడు ‘కాదేదీ సినిమా కథకు అనర్హం’ చేరింది. గతంలో కోతి, పాము, ఏనుగు, కొండచిలువ, పులి, సింహం, కుక్క వంటి జంతువుల నేపథ్యంగా సినిమాలు వచ్చాయి. ఇటీవల ట్రెండ్ కాకులకు మారింది. మన బంధు పక్షి కోర్ టాపిక్‌గా ‘విరూపాక్ష’, కాకి ముట్టడం అనే స్టోరీ లైన్‌తో ‘దసరా, బలగం’, వస్తే ఇప్పుడు కాకుల విక్టరీ అంటూ శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’ తెరకెక్కిస్తున్నారు.
News March 3, 2025
UAEలో భారత మహిళకు మరణ శిక్ష అమలు

షెహజాదీ అనే భారత మహిళకు UAEలో ఈ నెల 15న మరణ శిక్ష అమలైంది. UPకి చెందిన ఆమెను విదేశాలకు తీసుకెళ్తానని నమ్మించిన ఓ బ్రోకర్ ఓ ముస్లిం జంటకు అమ్మేశాడు. వారు ఆమెను తమతో UAE తీసుకెళ్లి తమ బిడ్డ ఆలనాపాలనల్ని అప్పగించారు. ఆ బిడ్డ హఠాత్తుగా చనిపోవడంతో షెహజాదీపై హత్యారోపణలు మోపారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి చనిపోయిందని ఆమె వాదించినా ఆలకించని కోర్టు మరణ శిక్ష విధించింది.