News October 19, 2025

రాజంపేట: కొద్దిరోజుల్లో పెళ్లి.. అంతలోనే మృతి

image

మరికొన్ని రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి కొడుకు మృత్యుఒడికి చేరుకున్న విషాదకర సంఘటన శనివారం రాత్రి మాధవరం ప్రాంతంలో జరిగింది. రాజంపేట పట్టణం నూనెవారిపల్లెకు చెందిన శరత్ నాయుడు(29) నేషనల్ హైవే శాఖలో అధికారిగా పనిచేస్తున్నాడు. ఓ ఎక్స్‌ప్రెస్‌లో రాజంపేటకు వస్తుండగా కుటుంబ సభ్యులు ఫోన్ చేయడంతో డోర్ వద్దకు వెళ్లి మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తూ కిందపడి మృతి చెందాడని పోలీసులు తెలిపారు.

Similar News

News October 19, 2025

విజయవాడ: పర్యాటకులకు గుడ్ న్యూస్

image

విజయవాడ భవాని ఐలాండ్‌లో ఆదివారం నుంచి బోటు షికారు తిరిగి ప్రారంభమైంది. గత 60 రోజులుగా ఎగువ నుంచి కురుస్తున్న వర్షాల ఉధృతి, వర్షాల కారణంగా కృష్ణా నదిలో బోటు షికారు నిలిచిపోయింది. ఆదివారం బోటింగ్ తిరిగి ప్రారంభం కావడంతో టూరిస్టులు బోటు షికారుకు ఆసక్తి చూపారు. కాగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ నిర్వహణ జరుగుతోంది.

News October 19, 2025

పెనుగొండ: గోదావరిలో మహిళ మృతదేహం

image

పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద గోదావరి నదిలో ఓ మహిళ మృతదేహం కొట్టుకువచ్చింది. పెనుగొండ ఎస్ఐ కె. గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 40 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న మహిళ మృతదేహాన్ని నదిలో గుర్తించారు. సిద్ధాంతం వీఆర్‌వో నాగేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 19, 2025

నిర్మల్: టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

image

చెడుపై మంచి విజయం సాధించిన ప్రతీకగా దీపావళిని జరుపుకుంటామని, ప్రతి ఇంటిలో ఆనందం, వెలుగు నిండాలని ఆకాంక్షించారు. దీపావళి పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజలకు, అధికారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, సమృద్ధి కలగాలని కోరుకుంటూ, టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు.