News October 19, 2025
ఆర్మీలో 90 ఆఫీసర్ ఉద్యోగాలు

ఇండియన్ ఆర్మీ జులై 2026లో ప్రారంభమయ్యే 55వ 10+2 TES కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ (M.P.C)లో 60% మార్కులతో పాసై, JEE మెయిన్స్-2025 అర్హత సాధించినవారు NOV 13వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, SSB ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా 90మందిని ఎంపిక చేస్తారు. 4ఏళ్ల ట్రైనింగ్ తర్వాత ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు లెఫ్టినెంట్ ఉద్యోగం లభిస్తుంది.
Similar News
News October 19, 2025
విజయం దిశగా భారత్

ఉమెన్ వరల్డ్ కప్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచులో భారత బ్యాటర్లు నిలకడగా రాణిస్తున్నారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (70) రన్స్ చేసి ఔటయ్యారు. ఓపెనర్ స్మృతి మంధాన (63*) క్రీజులో ఉన్నారు. కౌర్, స్మృతి 120కి పైగా భాగస్వామ్యం నమోదు చేశారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 31 ఓవర్లలో 170/3గా ఉంది. టీమ్ ఇండియా విజయానికి 114 బంతుల్లో 119 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
News October 19, 2025
విషం తాగిన తల్లి.. కూతురు ఏం చేసిందంటే?

UP మీర్జాపూర్‌కు చెందిన ఐదేళ్ల బాలిక సమయస్ఫూర్తితో తల్లి ప్రాణాలు కాపాడుకుంది. నిన్న తన తల్లి విషం తాగడంతో శివాణి ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్ 1090కు కాల్ చేసింది. వెంటనే సమీపంలోని పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడు ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. ఎమర్జెన్సీ సమయంలో హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేయాలని స్కూల్లో చెప్పారని ఆ బాలిక చెప్పడంతో ప్రశంసలు కురుస్తున్నాయి.
News October 19, 2025
దీపావళి ఉత్సవాలు.. ఇవి గుర్తుంచుకోండి

*లైసెన్స్ పొందిన షాప్స్ నుంచే బాణసంచా కొనాలి.
*టపాకాయలు కాల్చేటప్పుడు కాటన్ వస్త్రాలు ధరించాలి. సింథటిక్ లేదా లూజ్ వస్త్రాలు ధరించవద్దు.
*పని చేయని పటాకులను మళ్లీ వెలిగించేందుకు ట్రై చేయవద్దు.
*క్రాకర్స్ వల్ల గాయమైతే ఐస్, వెన్న, ఆయింట్‌మెంట్ రాయవద్దు. 10-15 ని. పాటు శుభ్రమైన నీటితో చల్లగా ఉంచాలి.
*అత్యవసర సమయాల్లో 101 లేదా 112కి కాల్ చేయాలి.