News October 19, 2025
కొత్తగూడెం: మద్యం షాపుల దరఖాస్తుల గడువు పెంపు

బీసీ బంద్, బ్యాంకు బంద్‌ల కారణంగా దరఖాస్తులు సమర్పించలేని ఔత్సాహికుల విజ్ఞప్తి మేరకు మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు జిల్లా అబ్కారీ అధికారి జానయ్య తెలిపారు. ఈ కారణంగా ఈనెల 23న జరగాల్సిన మద్యం షాపుల డ్రాను ఈనెల 27కు వాయిదా వేసినట్లు చెప్పారు. డ్రాను కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
Similar News
News October 19, 2025
మస్కట్‌లో సిరిసిల్ల యువకుడు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన ఆకుల శ్రీకాంత్ గౌడ్ అనారోగ్యంతో మస్కట్‌లో మృతి చెందాడు. బతుకుదెరువుకు మస్కట్ దేశం వెళ్లిన శ్రీకాంత్ మరణించాడన్న సమాచారం అందడంతో కుటుంబ సబ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బంధుమిత్రులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. శ్రీకాంత్ మృతదేహాన్ని స్వగ్రామానికి వెంటనే రప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు.
News October 19, 2025
RTCలో డ్రైవర్, శ్రామిక్ పోస్టులు.. 9 రోజులే ఛాన్స్

TGSRTCలో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టులకు 22-35 ఏళ్లు, శ్రామిక్ పోస్టులకు 18-30 ఏళ్ల వయసు ఉండాలి. SC, ST, BC, EWS కేటగిరీలకు 5 ఏళ్ల మినహాయింపు ఉంది. డ్రైవర్ పోస్టులకు పదో తరగతి పాసై ఉండాలి. హెవీ గూడ్స్ వెహికల్ లేదా హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. సైట్: <
News October 19, 2025
వేములవాడ: అదృశ్యమైన యువకుడి మృతదేహం లభ్యం

చందుర్తి మండలం జోగాపూర్‌కి చెందిన యువకుడు మట్టెల తిరుపతి మృతదేహం ఆదివారం సాయంత్రం లభ్యమైంది. గ్రామానికి చెందిన మట్టెల దేవయ్య- భాగ్యవల కుమారుడు తిరుపతి మతిస్థిమితం లేక ఇంటి వద్దనే ఉంటున్నాడు. సెప్టెంబర్ 29న గ్రామంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి అతడి కోసం వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం సాయంత్రం కిష్టంపేట శివారు బావిలో శవం దొరికింది.