News October 19, 2025

KNR: కర్తవ్య భవన్‌లోకి మారిన బండి సంజయ్ ఆఫీస్

image

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన శాఖ కార్యాలయంను కర్తవ్య భవన్‌లోకి మార్చారు. సెంట్రల్ విస్టా రీ-డెవలెప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా నూతనంగా నిర్మించిన కామన్ సెంట్రల్ సచివాలయాన్ని ప్రధాని AUG 6న ప్రారంభించారు. కాగా, దీపావళిని పురస్కరించుకొని నేడు మంచి మహూర్తం ఉండటంతో అర్చకుల వేద మంత్రోచ్చారణల నడుమ కర్తవ్య భవన్‌లోకి మంత్రి అడుగుపెట్టారు. ప్రత్యేక పూజలు చేసి తనకు కేటాయించిన సీట్లో ఆశీసునలయ్యారు.

Similar News

News October 20, 2025

తొగుట: కస్తూర్బా పాఠశాల.. కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

image

తొగుటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. రాత్రివేళల్లో విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతను ఆమె పరిశీలించారు. వంటగదికి వెళ్లి మెనూ ప్రకారం బీరకాయ కూర, సాంబారు పెడుతున్నారా అని ఆరా తీశారు. అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేస్తూ, రాత్రి విధులు నిర్వహించే అధ్యాపకులు సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించాలని ఆదేశించారు.

News October 20, 2025

రేపు ప్రజావాణి రద్దు: భద్రాద్రి కలెక్టర్

image

దీపావళి పర్వదినం సందర్భంగా సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. పండుగ సందర్భంగా జిల్లా అధికారులు ఉండరని, ఈ అంశాన్ని జిల్లా ప్రజలు గమనించి ఎవరు కూడా కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు

News October 20, 2025

తప్పిన పెను ప్రమాదం

image

బండి ఆత్మకూరు- పార్నపల్లె గ్రామాల మధ్య ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నారాయణపురం గ్రామానికి చెందిన విష్ణు, హెడ్ కానిస్టేబుల్ రమణ రావు కారులో వెళ్తుండగా వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.