News October 19, 2025

భారీ జీతంతో NMDCలో ఉద్యోగాలు

image

NMDC లిమిటెడ్ 14 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, CGM, GM, డైరెక్టర్ తదితర పోస్టులు ఉన్నాయి. అన్ని పోస్టులకు OCT 21 ఆఖరు తేదీ కాగా.. డైరెక్టర్ పోస్టుకు OCT 27 లాస్ట్ డేట్. పోస్టును బట్టి ఇంజినీరింగ్ డిగ్రీ (మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్), PG, PG డిప్లొమా, MBA, MSc, ఎంటెక్, MSc జియోలజీ, CA/ICMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

Similar News

News October 19, 2025

WWC: ఉత్కంఠ పోరులో భారత జట్టు ఓటమి

image

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో భారత్ 4 పరుగుల తేడాతో ఓడింది. 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 284/6 రన్స్‌కు పరిమితమైంది. స్మృతి మంధాన 88, హర్మన్ ప్రీత్ 70, దీప్తి శర్మ 50 రన్స్‌తో రాణించారు. సులభంగా గెలిచే అవకాశాలున్నా చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయి, బౌండరీలు బాదకపోవడంతో ఓటమి తప్పలేదు. ఈ పరాజయంతో టీమ్ ఇండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.

News October 19, 2025

RTCలో డ్రైవర్, శ్రామిక్ పోస్టులు.. 9 రోజులే ఛాన్స్

image

TGSRTCలో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టులకు 22-35 ఏళ్లు, శ్రామిక్ పోస్టులకు 18-30 ఏళ్ల వయసు ఉండాలి. SC, ST, BC, EWS కేటగిరీలకు 5 ఏళ్ల మినహాయింపు ఉంది. డ్రైవర్ పోస్టులకు పదో తరగతి పాసై ఉండాలి. హెవీ గూడ్స్ వెహికల్ లేదా హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. సైట్: <>www.tgprb.in/<<>>

News October 19, 2025

దీపావళి: దీపారాధనకు పాత ప్రమిదలను వాడొచ్చా?

image

పాత(లేదా) గతేడాది వాడిన మట్టి ప్రమిదలను ఈసారి కూడా వెలిగించడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ‘ప్రమిదలు దైవిక శక్తులతో పాటు ప్రతికూల శక్తులను కూడా గ్రహిస్తాయి. వాటిని తిరిగి వాడితే అది మన అదృష్టాన్ని, సంపదను ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీపావళి రోజున కొత్త ప్రమిదలను వాడటమే శ్రేయస్కరం. పాత ప్రమిదలను తులసి కోటళ్లో, గౌరవంగా పవిత్ర నదుల్లో, పవిత్ర చెట్ల మొదళ్లలో ఉంచడం మంచిది.