News October 19, 2025
చిన్నకోడూరు: కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలి: హరీశ్ రావు

సిద్దిపేట జిల్లా ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదివారం చిన్నకోడూరు మండలంలో మొక్కజొన్న పంటలను పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి తిట్ల మీద ఉన్న ధ్యాస పత్తి, మొక్కజొన్న రైతుల కష్టాలపై లేదన్నారు. అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను కొనుగోళ్లు ఆలస్యం చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మరింత నష్టపరుస్తుందని విమర్శించారు.
Similar News
News October 20, 2025
జూబ్లీహిల్స్‌లోనే కాంగ్రెస్ పార్టీకి మొదటి దెబ్బ: కేటీఆర్

TG: కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS మొదటి దెబ్బ కొట్టబోతుందని తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ నేత కేటీఆర్ అన్నారు. రెండో దెబ్బ రాజేంద్రనగర్ లేదా ఖైరతాబాద్‌లో కొడుతామన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని విమర్శలు చేశారు. ఫిరాయింపు స్థానాల్లో ఉపఎన్నికలు ఖాయమని స్పష్టం చేశారు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికకు రావాలని సవాల్ విసిరారు.
News October 20, 2025
రాష్ట్ర షూటింగ్ బాల్ టీమ్‌కు గద్వాల బిడ్డ కెప్టెన్

గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం జడ్పీహెచ్ఎస్ నందిన్నెలో చదువుతున్న మహేశ్వరి తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ టీమ్‌కు కెప్టెన్‌గా ఎంపికైంది. దీంతో ఆమెను ప్రధానోపాధ్యాయుడు విజయభాస్కర్, పీఈటీ అమ్రేష్ బాబు, తల్లిదండ్రులు అభినందించారు. మహేశ్వరి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మండల ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.
News October 20, 2025
KMR: RTA చెక్‌పోస్ట్‌లపై ACB మెరుపు దాడి (UPDATE)

అవినీతి పాల్పడుతున్న అధికారుల గుండెల్లో ACB రైళ్లను పరిగెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో మద్నూర్ మండలం సలాబత్పూర్ RTA చెక్‌పోస్ట్‌పై దాడి జరిపిన ACB అధికారులు రూ.36 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా, బిక్కనూర్ పొందుర్తి చెక్‌పోస్ట్ వద్ద దాడులు నిర్వహించి రూ.51,300 స్వాధీనం పరుచుకున్నారు. మూడు నెలల వ్యవధిలోనే ఈ ఆర్టీఏ చెక్‌పోస్ట్‌లపై ఏసీబీ దాడి జరగడం గమనార్హం.