News October 19, 2025
విజయవాడ: పర్యాటకులకు గుడ్ న్యూస్

విజయవాడ భవాని ఐలాండ్‌లో ఆదివారం నుంచి బోటు షికారు తిరిగి ప్రారంభమైంది. గత 60 రోజులుగా ఎగువ నుంచి కురుస్తున్న వర్షాల ఉధృతి, వర్షాల కారణంగా కృష్ణా నదిలో బోటు షికారు నిలిచిపోయింది. ఆదివారం బోటింగ్ తిరిగి ప్రారంభం కావడంతో టూరిస్టులు బోటు షికారుకు ఆసక్తి చూపారు. కాగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ నిర్వహణ జరుగుతోంది.
Similar News
News October 20, 2025
దీపావళి సమయంలోనే ఆలయానికి ఎంట్రీ

కర్ణాటకలోని చిక్కమగళూరులో కొండపై ఉన్న దేవిరామ్మ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. స్థానిక ఆచారం ప్రకారం దీపావళి సందర్భంగా మాత్రమే ఈ ఆలయంలోకి భక్తులను అనుమతిస్తారు. ఈ ఏడాది నైట్ ట్రెక్కింగ్‌పై నిషేధం విధించి నిన్న, ఇవాళ దర్శనానికి అనుమతించారు. ఈ క్రమంలో నిన్న భక్తులు కొండను ఎక్కుతున్న సమయంలో డ్రోన్‌తో తీసిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు రావడం గమనార్హం.
News October 20, 2025
జూబ్లీహిల్స్‌లోనే కాంగ్రెస్ పార్టీకి మొదటి దెబ్బ: కేటీఆర్

TG: కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS మొదటి దెబ్బ కొట్టబోతుందని తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ నేత కేటీఆర్ అన్నారు. రెండో దెబ్బ రాజేంద్రనగర్ లేదా ఖైరతాబాద్‌లో కొడుతామన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని విమర్శలు చేశారు. ఫిరాయింపు స్థానాల్లో ఉపఎన్నికలు ఖాయమని స్పష్టం చేశారు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికకు రావాలని సవాల్ విసిరారు.
News October 20, 2025
రాష్ట్ర షూటింగ్ బాల్ టీమ్‌కు గద్వాల బిడ్డ కెప్టెన్

గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం జడ్పీహెచ్ఎస్ నందిన్నెలో చదువుతున్న మహేశ్వరి తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ టీమ్‌కు కెప్టెన్‌గా ఎంపికైంది. దీంతో ఆమెను ప్రధానోపాధ్యాయుడు విజయభాస్కర్, పీఈటీ అమ్రేష్ బాబు, తల్లిదండ్రులు అభినందించారు. మహేశ్వరి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మండల ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.