News April 8, 2024
బోట్ యూజర్లకు షాక్!
ప్రముఖ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ బోట్‌కు సంబంధించి ఫోర్బ్స్ ఇండియా సంచలన రిపోర్ట్ వెల్లడించింది. ఈ సంస్థ నుంచి స్మార్ట్‌వాచ్, హెడ్‌ఫోన్స్ వంటి గ్యాడ్జెట్లు కొన్న 75లక్షల మందికిపైగా కస్టమర్ల పర్సనల్ డేటా లీకైనట్లు తెలిపింది. ShopifyGUY అనే హ్యాకర్ ఈ డేటాను డార్క్ వెబ్‌లో లీక్ చేసినట్లు పేర్కొంది. ఇందులో కస్టమర్ల పేర్లు, ఈమెయిల్స్, ఫోన్ నంబర్లు, కస్టమర్ ఐడీలు మొదలైన వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 15, 2024
కపిల్‌శర్మ షో నుంచి అందుకే బయటికొచ్చా: సిద్ధూ
కపిల్‌శర్మ షో నుంచి నిష్క్రమించడంపై నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎట్టకేలకు మౌనం వీడారు. రాజకీయాల వల్లే తాను షో నుంచి వైదొలగాల్సి వచ్చిందన్నారు. అంతకంటే ఎక్కువ వివరించకూడదని చెప్పారు. 2019లో ఈ షో నుంచి సిద్ధూ నిష్క్రమించడం అభిమానులకు షాక్ ఇచ్చింది. అయితే పుల్వామా దాడి గురించి ఆయన ‘ఉగ్రవాదులకు మతాలు లేవు’ అని చేసిన వ్యాఖ్యల వల్లే షో నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని అప్పట్లో ప్రచారం జరిగింది.
News November 15, 2024
నవంబర్ 15: చరిత్రలో ఈ రోజు
* 1949: నాథూరామ్ గాడ్సే మరణం.
* 1982: భారత స్వాతంత్ర్య సమరయోధుడు వినోబా భావే మరణం.
* 1986: భారతదేశ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జననం.
* 2000: బీహార్ నుంచి ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.
* 2022: నటుడు ఘట్టమనేని కృష్ణ మరణం(ఫొటోలో).
News November 15, 2024
IPL: 2 సెట్లుగా టాప్ క్రికెటర్ల వేలం
IPL మెగా వేలం Nov 24, 25ల్లో జరగనున్న నేపథ్యంలో ప్రాంఛైజీలు పలువురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. రిటైన్ కానివారు, కొత్త క్రికెటర్లు వేలంలో పాల్గొనున్నారు. అయితే ఈ వేలంలోని టాప్ క్రికెటర్లను 2 సెట్లుగా విభజించినట్లు BCCI తెలిపింది. పంత్, రాహుల్, శ్రేయస్, సిరాజ్, షమీ, అర్ష్‌దీప్, అశ్విన్, స్టార్క్, బట్లర్ వంటి ప్లేయర్లు ఈ లిస్టులో ఉంటారు. ప్రతి సెట్లో 8-9 మంది టాప్ క్రికెటర్లుంటారు.