News October 19, 2025

లేగదూడను చూసి CM మురిసే!

image

యాదవుల సదర్ అంటే CM‌ రేవంత్ రెడ్డికి మక్కువ అని చెప్పడానికి ఈ ఫొటో చక్కటి ఉదాహరణ. NTR స్టేడియం వద్ద నిర్వహించిన సదర్‌లో రేవంత్ ఏ ఒక్కరినీ నిరాశ పర్చలేదు. కళాకారుల నుంచి యువత వరకు అందరినీ పలకరించారు. యాదవ సోదరులతో ఫొటోలు దిగి సంభాషించారు. వేదిక ఎక్కిన తర్వాత అందంగా అలంకరించిన ఓ లేగదూడను చూసి ఆయన ముగ్ధుడయ్యారు. ఆ దూడెను తన దగ్గరకు తీసుకోవడం సదర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Similar News

News October 20, 2025

డబ్బుల్లేక భోజనం చేసేందుకు ఇబ్బందిపడ్డాం: సమంత

image

తాను సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినట్లు హీరోయిన్ సమంత ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన కుటుంబం పడ్డ బాధలను ఎప్పుడూ మరిచిపోలేదని తెలిపారు. ఆ సమయంలో డబ్బులు సరిగ్గా లేకపోవడంతో భోజనం చేయడానికి ఇబ్బంది పడినట్లు గుర్తు చేశారు. మొదటి సినిమాతోనే పేరు, ప్రశంసలు వచ్చాయని, వాటిని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదన్నారు. కష్టపడితేనే జీవితం ఉంటుందని తనను తాను మార్చుకొని ముందుకు వెళ్లానని వెల్లడించారు.

News October 20, 2025

కోరుట్ల నుంచి అరుణాచలానికి SPECIAL BUS

image

కోరుట్ల నుంచి అరుణాచల గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ మనోహర్ తెలిపారు. నవంబర్ 3న సాయంత్రం 4 గంటలకు కోరుట్ల నుంచి బస్ బయలుదేరి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం 5న అరుణాచలం చేరుకుంటుందన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం బయలుదేరి 6న మహానంది, జోగులాంబ దర్శనాల తర్వాత తిరిగి కోరుట్ల వస్తుందన్నారు. ఛార్జి పెద్దలకు రూ.5,500, పిల్లలకు రూ.4,180 ఉంటుందన్నారు.

News October 20, 2025

సిరిసిల్ల: పారా అథ్లెట్ అర్చనకు KTR ఆసరా..!

image

పారా అథ్లెట్ మిట్టపల్లి అర్చనకు కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు. సిరిసిల్ల పరిధిలోని చంద్రంపేటకు చెందిన అర్చన, ఆమె కుటుంబం హైదరాబాదులోని కేటీఆర్ నివాసంలో ఆయనను ఆదివారం కలిశారు. డిసెంబర్ 8 నుంచి 10 వరకు శ్రీలంకలో జరిగే సౌత్ ఏషియన్ ఛాంపియన్షిప్‌లో దేశం నుంచి ప్రాతినిథ్యం వహించేందుకు పారా త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాచే అర్చన ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో శ్రీలంక వెళ్లేందుకు KTR అర్చనకు ఆర్థిక సాయం అందజేశారు.