News October 19, 2025
గజ్వేల్: పీహెచ్‌సీ తనిఖీ చేసిన కలెక్టర్.. సీరియస్

గజ్వేల్ మండలం అహ్మదీపూర్ పీహెచ్‌సీని జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించిన కలెక్టర్, సంతకాల్లో తేడాలు గుర్తించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి రాకుండానే సంతకాలు చేసినట్లు గుర్తించి, సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీఎంహెచ్ఓను ఆదేశించారు.
Similar News
News October 20, 2025
నిర్మల్: జిల్లాలో మద్యం దుకాణాలకు 942 దరఖాస్తులు

జిల్లాలో 47 నూతన మద్యం దుకాణాలకు సంబంధించి మొత్తం 942 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి రజాక్ తెలిపారు. మద్యం దుకాణాల దరఖాస్తు గడు ఈనెల 23వ తేదీ వరకు పొడగించినట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన వారు మధ్య దుకాణాలకు జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవచ్చని అన్నారు. ఈనెల 27న దుకాణాల టెండర్లను డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేస్తున్నట్టు చెప్పారు.
News October 20, 2025
ఇవాళ భారీ వర్షాలు

ఇవాళ ఏపీలోని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు తెలంగాణలోని కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు ఉ.8.30 గంటలలోపు IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News October 20, 2025
వనపర్తి: ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు 490 కేంద్రాలు

జిల్లాలో ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలుకు 490 కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అధికారులు సన్నాహాలు చేశారు. జిల్లాలో 1.99 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 4.69 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చని అంచనా వేశారు. ఇందులో ప్రభుత్వం 4.30 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏ గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.2,389, బి గ్రేడ్ ధాన్యానికి రూ.2,369 చెల్లించాలని నిర్ణయించినట్లు సమాచారం.