News October 19, 2025

విశాఖ-బెంగళూరు మధ్య స్పెషల్ రైలు

image

దీపావళి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైలును నడపనుంది. అక్టోబర్ 21న ఉదయం 8.20కు విశాఖపట్నం నుంచి బెంగళూరు ఎస్‌ఎమ్‌వీటీకి వన్‌వే స్పెషల్ రైలు (సంఖ్య 08545) బయలుదేరి, అక్టోబర్ 22న ఉదయం 6.45కు చేరుతుంది. దువ్వాడ, అనకాపల్లి,యలమంచిలి, సామర్లకోట రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది.

Similar News

News October 20, 2025

దీపావళి రోజున దివ్వెలు ఎందుకు వెలిగించాలి?

image

దీపం సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం. సకల దేవతల నివాసం. దీపం వెలిగించిన చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అందుకే దీపం లేని ఇల్లు కళావిహీనమవుతుంది. దీపారాధన లేకుండా దీపావళి చేయరు. దీపపు కుందిలో బ్రహ్మ, విష్ణుమూర్తి ఉంటారు. ఈ వెలుగుల పండుగ రోజున వారే స్వయంగా ఇంట్లో వెలుగు నింపుతారు. దీపం సమస్త దేవతా స్వరూపం కాబట్టే వారిని ఆహ్వానించి, అనుగ్రహం పొందడానికి దీపావళి నాడు దీపాలు వెలిగించాలి.

News October 20, 2025

ప్రమాదాలు జరిగితే ఈ నంబర్లకు కాల్ చేయండి: SP

image

మతాబులు కాల్చేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ దామోదర్ ఆదివారం సూచించారు. చిన్నపిల్లలు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే మతాబులు కాల్చాలని, పాత లేదా తడిసిన మతాబులు వినియోగించరాదని చెప్పారు. కాటన్ దుస్తులు ధరించాలనీ, నైలాన్ లేదా సింథటిక్ దుస్తులు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే 101, 100, 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

News October 20, 2025

ADB: ‘బాణసంచా కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి’

image

దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చే సమయంలో ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. టపాసులు కాల్చే సమయంలో కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలి. ముఖం దగ్గరగా పెట్టి బాణసంచా కాల్చకండి. మీ పిల్లల పక్కనే మీరు ఉండి టపాసులు కాల్చండి. పేలని టపాసుల వద్దకు వెళ్ళకూడదు. అవి ఎప్పుడు పేలేది తెలియాదు. బాగా పొగ ఎక్కువ వచ్చే టపాసులను కాల్చకూడదు. దీనివల్ల ఊపిరితిత్తులపై దుష్ప్రభావం పడుతుంది.