News October 20, 2025

ఇదేం ఆట.. టీమ్ ఇండియాపై ఫ్యాన్స్ ఫైర్

image

వరల్డ్ కప్-2025: ఇంగ్లండ్‌పై భారత మహిళల టీమ్ చేజేతులా మ్యాచ్ ఓడిపోయిందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 30 బంతుల్లో 36 రన్స్ చేయాల్సి ఉండగా 6 వికెట్లు చేతిలో ఉన్నాయని, అయినా గెలవలేకపోయిందని మండిపడుతున్నారు. ఇలాంటి ఆటతీరుతో భారత్ WC నెగ్గడం కష్టమేనని విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా గత 3 మ్యాచుల్లో భారత్ పరాజయం పాలైంది. దీంతో సెమీస్ అవకాశాలు సన్నగిల్లాయి. అటు AUS, దక్షిణాఫ్రికా, ENG సెమీస్ చేరాయి.

Similar News

News October 20, 2025

కొత్తగా 41 కాలేజీలు.. 10,650 ఎంబీబీఎస్ సీట్లు

image

2025-26 విద్యాసంవత్సరానికిగానూ 10,650 MBBS సీట్లకు NMC ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం సీట్ల సంఖ్య 1,37,600కు చేరనుంది. వీటిలో INIకు చెందిన సీట్లూ ఉన్నాయని వెల్లడించింది. దీంతో పాటు 41 నూతన మెడికల్ కాలేజీలకు ఆమోదం తెలపగా మొత్తం విద్యాసంస్థల సంఖ్య 816కు పెరగనుంది. అటు పీజీ సీట్లు 5వేల వరకు పెరిగే ఛాన్స్ ఉందని దీంతో దేశవ్యాప్తంగా వీటి సంఖ్య 67వేలకు చేరే అవకాశం ఉంది.

News October 20, 2025

నేవల్ షిప్ రిపేర్, ఎయిర్‌క్రాఫ్ట్ రిపేర్ యార్డ్‌లో 224 పోస్టులు

image

నేవల్ షిప్ రిపేర్ యార్డ్( కార్వార్, కర్ణాటక), నేవల్ ఎయిర్‌క్రాఫ్ట్ రిపేర్ యార్డ్ (గోవా)లో 224 అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు NOV 16లోపు నేషనల్ అప్రెంటిస్‌షిప్ వెబ్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని, డాక్యుమెంట్స్‌ను స్పీడ్/ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి. వెబ్‌సైట్: www.apprenticeshipindia.gov.in/

News October 20, 2025

దీపావళి: నేడు ఏ రంగు దుస్తులు ధరించాలి?

image

దీపావళి లక్ష్మీ పూజలో పసుపు, ఎరుపు, తెలుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు. పసుపు(బృహస్పతి) సంపద, శాంతిని, ఎరుపు(కుజుడు) శక్తి, ధైర్యాన్ని, తెలుపు శాంతి, లక్ష్మీ కటాక్షాన్ని సూచిస్తాయని అంటున్నారు. నీలం, నలుపు రంగులు అశుభమని, ఆ రంగు దుస్తులు ధరించకూడదని అంటున్నారు. నైలాన్, పాలిస్టర్‌లకు దూరంగా, కాటన్, పట్టు వంటి సురక్షితమైన వస్త్రాలను ధరించడం శ్రేయస్కరం’ అంటున్నారు.