News April 8, 2024
గాజువాక CPM ఎమ్మెల్యే అభ్యర్థిగా జగ్గు నాయుడు

సీపీఎం గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు పోటీ చేయనున్నారు. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విజయవాడలో ఆయన పేరును ప్రకటించారు. జగ్గునాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నారు.
Similar News
News October 4, 2025
విశాఖలో గంజిపడి 16 మంది పిల్లలకు గాయాలు

విశాఖలో అన్నదానం కార్యక్రమం వద్ద శనివారం అపశృతి చోటుచేసుకుంది. జాలరిపేటలోని దుర్గమ్మ ఆలయం సమీపంలో పిల్లా అప్పయ్యమ్మ సంఘం వద్ద అన్నదాన కార్యక్రమంలో గంజి పడి 16 మంది పిల్లలు, మహిళలు గాయపడ్డారు. బాధితులను కేజీహెచ్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కేజీహెచ్ సూపరింటెండెంట్ డా.వాణితో మాట్లాడి మెరుగైన చికిత్స ఇవ్వాలని సూచించారు.
News October 4, 2025
విశాఖలో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం ప్రారంభం

విశాఖ చిల్డ్రన్ ఏరినాలో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి శనివారం ప్రారంభించారు. MLA వెలగపూడి రామకృష్ణ బాబు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 2.90 లక్షల డ్రైవర్లకు రూ.436 కోట్లు, విశాఖ జిల్లాలో 22,955 మందికి రూ.34.43 కోట్లు లబ్ధి అందనుందని మంత్రి డోలా పేర్కొన్నారు.
News October 4, 2025
భీమిలిలో పేలిన మందుగుండు

విశాఖలో మందుగుండు పేలి ముగ్గురు యువకులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఇవాళ ఉదయం భీమిలి మండలం వలందపేటలో జరిగింది. దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రతిష్ఠించిన అమ్మవారి నిమజ్జనోత్సవంలో బాణసంచా కోసం మందుగుండు సామగ్రిని తీసుకొచ్చి తయారు చేస్తుండగా పేలింది. దీంతో మహేశ్, వాసు, కనకరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆరిలోవ ఆసుపత్రికి తరలించారు. సీఐ తిరుమలరావు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.