News October 20, 2025
GNT: ఇలాంటి అనుభవాలు మీకు ఉన్నాయా.?

ఆ రోజులలోని దీపావళి ఎక్సైట్మెంట్ ఇప్పుడు ఉండటం లేదు. 7 రోజుల ముందు నుంచే రీల్స్ గన్స్ పేల్చుకుంటూ జేమ్స్ బాండ్లా ఫీల్ అయ్యేవాళ్లం. పండుగ రోజున నాన్నతో టపాసులు కొనుక్కొని డాబాపై ఎండబెట్టి, నాగుల చవితి కోసం కొన్ని దాచుకోని, సాయంత్రం క్రాకర్స్ కాల్చుకునేవాళ్లం. రాత్రికి ఇంటిబయట కాగితాలు బట్టి.. ఎవరు ఎక్కువ కాల్చారో ఫ్రెండ్స్‌తో డిస్కషన్‌తో పండుగ ముగిసేది. ఇలాంటి అనుభవాలు మీకు ఉంటే COMMENT చేయండి.
Similar News
News October 20, 2025
HYDలో రాత్రి 8- 10 మధ్యనే క్రాకర్లు కాల్చాలి

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాత్రి 8- 10 గంటల మధ్యే క్రాకర్లు కాల్చాలని నగర పోలీసులు చెబుతున్నారు. చిన్న పిల్లలు పటాకులు కాల్చేటప్పుడు పెద్దలు దగ్గర ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాల్చాలని చెప్పారు. ఇసుక, నీళ్లు దగ్గర ఉంచుకోవాలన్నారు. పబ్లిక్ రోడ్లపై క్రాకర్లు కాల్చకూడదని హెచ్చరించారు. దీపావళి వేడుకల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తిరుమలగిరి ఇన్‌స్పెక్టర్ నాగరాజు సూచించారు.
News October 20, 2025
కృష్ణా: ఈ ఆలయం నరకాసురుడి సంహారానికి ప్రతీక..!

చల్లపల్లి మండలం నడకుదురులోని కృష్ణానది తీరాన ఉన్న పృథ్వీశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది. శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై ఇక్కడే నరకాసురుడిని సంహరించారని ఇతిహాసం. అందుకే ఈ ప్రాంతం ‘నరకొత్తూరు’ నుంచి ‘నడకుదురు’గా మారింది. ఇక్కడి పాటలీ వృక్షం అరుదైనది. దీపావళికి నరకాసురుడి దిష్టిబొమ్మ దహనం చేస్తారు. కార్తికంలో భక్తులు నది స్నానమాచరించి మొక్కులు తీర్చుకుంటారు.
News October 20, 2025
సంగారెడ్డి: ‘దీపావళి.. 101కు కాల్ చేయండి’

దీపావళి సందర్భంగా టపాకాయలు కాల్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం తెలిపారు. అగ్ని ప్రమాదాలు, గాయాలు సంభవిస్తే వెంటనే సమీప అగ్నిమాపక కేంద్రానికి లేదా 101కు సంప్రదించాలని సూచించారు. చిన్నపిల్లలు టపాకాయలు కాల్చేటప్పుడు పెద్దలు దగ్గర ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని, పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు.