News October 20, 2025

బాపట్లలో నేడు PGRS రద్దు: కలెక్టర్

image

బాపట్ల కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈనెల 20న దీపావళి సందర్భంగా ప్రభుత్వం సెలవు దినం ప్రకటించినందున సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్జీలు ఇవ్వడానికి ప్రజలు జిల్లా కేంద్రానికి రావద్దని సూచించారు.

Similar News

News October 20, 2025

HYDలో రాత్రి 8- 10 మధ్యనే క్రాకర్లు కాల్చాలి

image

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాత్రి 8- 10 గంటల మధ్యే క్రాకర్లు కాల్చాలని నగర పోలీసులు చెబుతున్నారు. చిన్న పిల్లలు పటాకులు కాల్చేటప్పుడు పెద్దలు దగ్గర ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాల్చాలని చెప్పారు. ఇసుక, నీళ్లు దగ్గర ఉంచుకోవాలన్నారు. పబ్లిక్‌ రోడ్లపై క్రాకర్లు కాల్చకూడదని హెచ్చరించారు. దీపావళి వేడుకల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తిరుమలగిరి ఇన్‌స్పెక్టర్ నాగరాజు సూచించారు.

News October 20, 2025

కృష్ణా: ఈ ఆలయం నరకాసురుడి సంహారానికి ప్రతీక..!

image

చల్లపల్లి మండలం నడకుదురులోని కృష్ణానది తీరాన ఉన్న పృథ్వీశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది. శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై ఇక్కడే నరకాసురుడిని సంహరించారని ఇతిహాసం. అందుకే ఈ ప్రాంతం ‘నరకొత్తూరు’ నుంచి ‘నడకుదురు’గా మారింది. ఇక్కడి పాటలీ వృక్షం అరుదైనది. దీపావళికి నరకాసురుడి దిష్టిబొమ్మ దహనం చేస్తారు. కార్తికంలో భక్తులు నది స్నానమాచరించి మొక్కులు తీర్చుకుంటారు.

News October 20, 2025

సంగారెడ్డి: ‘దీపావళి.. 101కు కాల్ చేయండి’

image

దీపావళి సందర్భంగా టపాకాయలు కాల్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం తెలిపారు. అగ్ని ప్రమాదాలు, గాయాలు సంభవిస్తే వెంటనే సమీప అగ్నిమాపక కేంద్రానికి లేదా 101కు సంప్రదించాలని సూచించారు. చిన్నపిల్లలు టపాకాయలు కాల్చేటప్పుడు పెద్దలు దగ్గర ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని, పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు.