News October 20, 2025
WWC: భారత్ సెమీస్ చేరాలంటే?

WWCలో ఇంగ్లండ్‌పై ఓటమితో టీమ్‌ఇండియా సెమీస్ <<18053841>>ఆశలు<<>> సంక్లిష్టంగా మారాయి. రాబోయే రెండు మ్యాచుల్లో న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌పై గెలిస్తేనే ఇతర జట్ల ప్రదర్శనతో సంబంధం లేకుండా సెమీస్ చేరనుంది. ఒకవేళ న్యూజిలాండ్‌తో మ్యాచులో టీమ్ఇండియా ఓడితే బంగ్లాపై తప్పక గెలవాలి. మరోవైపు ఇంగ్లండ్ చేతిలో NZ ఓడాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇతర జట్లతో పోలిస్తే మెరుగైన RR ఉంటేనే భారత్ సెమీస్ చేరనుంది.
Similar News
News October 20, 2025
ఇతిహాసాలు క్విజ్ – 41

1. దశరథుడి ప్రధాన మంత్రి ఎవరు?
2. నకుల, సహదేవుల తల్లి ఎవరు?
3. విష్ణువు నివాసం ఉండే లోకం పేరు ఏమిటి?
4. ‘పంచాంగం’ అంటే ఎన్ని ముఖ్యమైన అంశాల సమాహారం?
5. ‘అన్నవరం’లో కొలువై ఉన్న దేవుడు ఎవరు?
– సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 20, 2025
ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 14 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. LDC, జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, B.E., బీటెక్, డిప్లొమా, ICAI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు NOV 5వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.500. SC, ST, PWBD, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. వెబ్‌సైట్: https://iwai.nic.in/
News October 20, 2025
కోళ్లలో అమ్మోరు లేదా మశూచి వ్యాధి

మశూచి వ్యాధి సోకిన కోళ్ల ముక్కు, ముఖం, కంటి రెప్పలు, దవడల పైన బొబ్బలు వచ్చి ముక్కు నుంచి, కంటి నుంచి నీరు కారుతూ ఉంటుంది. ఇది తక్కువ వ్యవధిలో ఇతర కోళ్లకు వ్యాపిస్తుంది. దీని వల్ల కోళ్ల మరణాలు తక్కువే ఉన్నప్పటికీ.. సరిగా మేత, నీరు తీసుకోలేవు. గుడ్లు పెట్టడం ఆగిపోతుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు. చర్మంపై కురుపుల్లో ఇతర సూక్ష్మక్రిములు చేరకుండా ఉండేందుకు పసుపు, వేపనూనె మిశ్రమాన్ని పూతగా పూయాలి.