News October 20, 2025

SRCL: మల్లోజుల, ఆశన్న విప్లవ ద్రోహులు..!

image

వరుస లొంగుబాట్లపై నిషేధిత CPI, మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కల్లపల్లి వాసుదేవరావు అలియాస్ సతీష్, ఆశన్న విప్లవ ద్రోహులుగా మిగిలిపోయారని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో కేంద్ర కమిటీ తాజాగా లేఖను విడుదల చేసింది. కేంద్ర కమిటీతో చర్చించకుండానే వారు లొంగిపోయారని బహిరంగంగా ఆరోపించింది.

Similar News

News October 20, 2025

ప్రజలకు జిల్లా కలెక్టర్ DIWALI WISHES

image

జగిత్యాల జిల్లా కలెక్టర్ బీ.సత్యప్రసాద్ జిల్లా ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. “ప్రతి దీపం ప్రతిఒక్కరి జీవితాల్లో విజయాల కాంతిని నింపాలి. ఈ దీపావళి పండుగలో దీపాల వెలుగు చీకటిని తొలగించి, మీ జీవితంలో ఆనందం, సంతోషం, శాంతితో పాటు కొత్త ఆశలను నింపాలని కోరుకుంటున్నాను” అని ప్రజలనుద్దేశించి ఆయన హృదయపూర్వక విషెస్ చెప్పారు.

News October 20, 2025

నిజాంసాగర్‌కు రికార్డు వరద.. వందేళ్ల చరిత్రలో ఇదే తొలిసారి

image

ఉమ్మడి NZB జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరదను నమోదు చేసింది. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాజెక్టులోకి భారీ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రాజెక్టుకు AUG 18న ప్రారంభమైన ఇన్‌ఫ్లో OCT 20 వరకు నిర్విరామంగా కొనసాగుతోంది. మధ్యలో 5 రోజులు ఇన్‌ఫ్లో తగ్గడంతో గేట్లు మూసివేసినప్పటికీ, తిరిగి గేట్లు ఎత్తి నీటిని దిగువన విడుదల చేస్తున్నారు.

News October 20, 2025

ఇతిహాసాలు క్విజ్ – 41

image

1. దశరథుడి ప్రధాన మంత్రి ఎవరు?
2. నకుల, సహదేవుల తల్లి ఎవరు?
3. విష్ణువు నివాసం ఉండే లోకం పేరు ఏమిటి?
4. ‘పంచాంగం’ అంటే ఎన్ని ముఖ్యమైన అంశాల సమాహారం?
5. ‘అన్నవరం’లో కొలువై ఉన్న దేవుడు ఎవరు?
– సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>