News October 20, 2025
అనకాపల్లి: ఈనెల 20 నుంచి 23 వరకు వర్షాలు

దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకు అనకాపల్లి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆదివారం తెలిపారు. ఈ మేరకు రైతులు వ్యవసాయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, చెట్ల క్రింద నిలబడకూడదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అనవసరంగా బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు.
Similar News
News October 20, 2025
24 నుంచి బిహార్‌లో మోదీ ఎన్నికల ప్రచారం

ప్రధాని మోదీ ఈ నెల 24 నుంచి బిహార్‌లో ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు ఆ రాష్ట్ర BJP వర్గాలు తెలిపాయి. 24న సమస్తీపూర్, బెగుసరాయ్‌లో జరిగే రెండు ర్యాలీల్లో ఆయన పాల్గొంటారని చెప్పాయి. తిరిగి 30న రెండు సభలకు హాజరవుతారని పేర్కొన్నాయి. నవంబర్ 2, 3, 6, 7వ తేదీల్లోనూ మోదీ ర్యాలీలు ఉంటాయని వివరించాయి. బిహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11వ తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.
News October 20, 2025
21న పోలీస్ అమరవీరుల సంస్మరణకు సీఎం రేవంత్: డీజీపీ

అక్టోబర్ 21 గోషామహల్ పోలీస్ స్టేడియంలో జరిగే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమానికి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి హాజరవనున్నారని డీజీపీ శివధర్ తెలిపారు. కార్యక్రమం ఉ.9.30 గంటలకు ప్రారంభమవుతుందని ఆయన ప్రకటించారు. అక్టోబర్ 21- 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
News October 20, 2025
మనోహరాబాద్: కూలి పనులకు వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి

కూలి పనుల నిమిత్తం వచ్చిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. పటాన్‌చెరు మండలం పెద్దకంచర్లకు చెందిన మన్నే మల్లేష్(35) కూలి పనుల కోసం మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌కు వచ్చాడు. శనివారం రాత్రి వేళ దీపక్ దాబా సమీపంలో హైవే రోడ్డు దాటుతుండగా తూప్రాన్ వైపు వెళ్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన మల్లేష్ అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.