News October 20, 2025
కామారెడ్డి: ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డిలోని కలెక్టరేట్ ఆవరణలో ఈ నెల 22వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రజని కిరణ్ తెలిపారు. ప్రైవేటు కంపెనీలో సేల్స్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్స్ ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువతీ యువకులు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ఆయన కోరారు. అభ్యర్థులు 30 సంవత్సరాల లోపు ఉండాలన్నారు.
Similar News
News October 20, 2025
ఈ-పంట నమోదు గడువు ఈ నెల 30 వరకు పొడిగింపు

APలో ఖరీఫ్ పంటల ఈ-క్రాప్ నమోదు గడువును ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడిగించింది. సర్వే చేయడానికి వీలులేని కాలువలు, రోడ్లు, ఆక్వా-వ్యవసాయేతర భూములను సర్వే నుంచి మినహాయించారు. e-cropలో భాగంగా రైతు ఆధార్, ఫోన్ నంబర్, భూమి, పాస్ బుక్‌తో పాటు రైతుల ఫొటోలను ఈ-పంట యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఈ-క్రాప్‌లో నమోదైన రైతుల నుంచే ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తుంది. వీరికే పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ వర్తిస్తుంది.
News October 20, 2025
మాలేపాటి మృతిపై మంత్రి లోకేశ్ సంతాపం

APఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలియజేశారు. ‘పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన సుబ్బానాయుడు కావలి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా పనిచేశారు. పార్టీ పటిష్టత కోసం, ప్రజల అభ్యున్నతి కోసం ఆయన విశేషంగా కృషి చేశారు. వారి మరణం పార్టీకి తీరని లోటు. సుబ్బానాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’. అని అన్నారు.
News October 20, 2025
మరణంలోనూ వీడని బంధం.. ఒకేరోజు భార్యాభర్తల మృతి

నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణంలోని ఆరువేటి లక్ష్మీనారాయణ (85), వెంకట లక్ష్మమ్మ (80) దంపతులు ఒకే రోజు మరణించారు. 60ఏళ్ల వివాహ బంధంలో ఒకరికొకరు తోడుగా ఉన్న వారు అనారోగ్యం కారణంగా వారిద్దరూ ఆదివారం మృతి చెందారు. ఒకేరోజు ఇద్దరు చనిపోవడం వింతగా ఉందని, ఇలాంటి ఘటన మునుపెన్నడూ జరగలేదని గ్రామస్థులు తెలిపారు. మరణంలోనూ వీడని బంధంగా ఈ సంఘటన నిలిచిందని పేర్కొన్నారు. స్థానికులు నివాళి అర్పించారు.