News October 20, 2025

సిరిసిల్ల: పారా అథ్లెట్ అర్చనకు KTR ఆసరా..!

image

పారా అథ్లెట్ మిట్టపల్లి అర్చనకు కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు. సిరిసిల్ల పరిధిలోని చంద్రంపేటకు చెందిన అర్చన, ఆమె కుటుంబం హైదరాబాదులోని కేటీఆర్ నివాసంలో ఆయనను ఆదివారం కలిశారు. డిసెంబర్ 8 నుంచి 10 వరకు శ్రీలంకలో జరిగే సౌత్ ఏషియన్ ఛాంపియన్షిప్‌లో దేశం నుంచి ప్రాతినిథ్యం వహించేందుకు పారా త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాచే అర్చన ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో శ్రీలంక వెళ్లేందుకు KTR అర్చనకు ఆర్థిక సాయం అందజేశారు.

Similar News

News October 20, 2025

ఈ-పంట నమోదు గడువు ఈ నెల 30 వరకు పొడిగింపు

image

APలో ఖరీఫ్ పంటల ఈ-క్రాప్ నమోదు గడువును ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడిగించింది. సర్వే చేయడానికి వీలులేని కాలువలు, రోడ్లు, ఆక్వా-వ్యవసాయేతర భూములను సర్వే నుంచి మినహాయించారు. e-cropలో భాగంగా రైతు ఆధార్, ఫోన్ నంబర్, భూమి, పాస్ బుక్‌తో పాటు రైతుల ఫొటోలను ఈ-పంట యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఈ-క్రాప్‌లో నమోదైన రైతుల నుంచే ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తుంది. వీరికే పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ వర్తిస్తుంది.

News October 20, 2025

మాలేపాటి మృతిపై మంత్రి లోకేశ్ సంతాపం

image

APఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలియజేశారు. ‘పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన సుబ్బానాయుడు కావలి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా పనిచేశారు. పార్టీ పటిష్టత కోసం, ప్రజల అభ్యున్నతి కోసం ఆయన విశేషంగా కృషి చేశారు. వారి మరణం పార్టీకి తీరని లోటు. సుబ్బానాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’. అని అన్నారు.

News October 20, 2025

మరణంలోనూ వీడని బంధం.. ఒకేరోజు భార్యాభర్తల మృతి

image

నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణంలోని ఆరువేటి లక్ష్మీనారాయణ (85), వెంకట లక్ష్మమ్మ (80) దంపతులు ఒకే రోజు మరణించారు. 60ఏళ్ల వివాహ బంధంలో ఒకరికొకరు తోడుగా ఉన్న వారు అనారోగ్యం కారణంగా వారిద్ద‌రూ ఆదివారం మృతి చెందారు. ఒకేరోజు ఇద్దరు చనిపోవడం వింతగా ఉందని, ఇలాంటి ఘటన మునుపెన్నడూ జరగలేదని గ్రామస్థులు తెలిపారు. మరణంలోనూ వీడని బంధంగా ఈ సంఘటన నిలిచిందని పేర్కొన్నారు. స్థానికులు నివాళి అర్పించారు.