News October 20, 2025
కోరుట్ల నుంచి అరుణాచలానికి SPECIAL BUS

కోరుట్ల నుంచి అరుణాచల గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ మనోహర్ తెలిపారు. నవంబర్ 3న సాయంత్రం 4 గంటలకు కోరుట్ల నుంచి బస్ బయలుదేరి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం 5న అరుణాచలం చేరుకుంటుందన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం బయలుదేరి 6న మహానంది, జోగులాంబ దర్శనాల తర్వాత తిరిగి కోరుట్ల వస్తుందన్నారు. ఛార్జి పెద్దలకు రూ.5,500, పిల్లలకు రూ.4,180 ఉంటుందన్నారు.
Similar News
News October 20, 2025
ఈ-పంట నమోదు గడువు ఈ నెల 30 వరకు పొడిగింపు

APలో ఖరీఫ్ పంటల ఈ-క్రాప్ నమోదు గడువును ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడిగించింది. సర్వే చేయడానికి వీలులేని కాలువలు, రోడ్లు, ఆక్వా-వ్యవసాయేతర భూములను సర్వే నుంచి మినహాయించారు. e-cropలో భాగంగా రైతు ఆధార్, ఫోన్ నంబర్, భూమి, పాస్ బుక్‌తో పాటు రైతుల ఫొటోలను ఈ-పంట యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఈ-క్రాప్‌లో నమోదైన రైతుల నుంచే ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తుంది. వీరికే పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ వర్తిస్తుంది.
News October 20, 2025
మాలేపాటి మృతిపై మంత్రి లోకేశ్ సంతాపం

APఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలియజేశారు. ‘పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన సుబ్బానాయుడు కావలి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా పనిచేశారు. పార్టీ పటిష్టత కోసం, ప్రజల అభ్యున్నతి కోసం ఆయన విశేషంగా కృషి చేశారు. వారి మరణం పార్టీకి తీరని లోటు. సుబ్బానాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’. అని అన్నారు.
News October 20, 2025
మరణంలోనూ వీడని బంధం.. ఒకేరోజు భార్యాభర్తల మృతి

నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణంలోని ఆరువేటి లక్ష్మీనారాయణ (85), వెంకట లక్ష్మమ్మ (80) దంపతులు ఒకే రోజు మరణించారు. 60ఏళ్ల వివాహ బంధంలో ఒకరికొకరు తోడుగా ఉన్న వారు అనారోగ్యం కారణంగా వారిద్దరూ ఆదివారం మృతి చెందారు. ఒకేరోజు ఇద్దరు చనిపోవడం వింతగా ఉందని, ఇలాంటి ఘటన మునుపెన్నడూ జరగలేదని గ్రామస్థులు తెలిపారు. మరణంలోనూ వీడని బంధంగా ఈ సంఘటన నిలిచిందని పేర్కొన్నారు. స్థానికులు నివాళి అర్పించారు.