News October 20, 2025

కొత్తగా 41 కాలేజీలు.. 10,650 ఎంబీబీఎస్ సీట్లు

image

2025-26 విద్యాసంవత్సరానికిగానూ 10,650 MBBS సీట్లకు NMC ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం సీట్ల సంఖ్య 1,37,600కు చేరనుంది. వీటిలో INIకు చెందిన సీట్లూ ఉన్నాయని వెల్లడించింది. దీంతో పాటు 41 నూతన మెడికల్ కాలేజీలకు ఆమోదం తెలపగా మొత్తం విద్యాసంస్థల సంఖ్య 816కు పెరగనుంది. అటు పీజీ సీట్లు 5వేల వరకు పెరిగే ఛాన్స్ ఉందని దీంతో దేశవ్యాప్తంగా వీటి సంఖ్య 67వేలకు చేరే అవకాశం ఉంది.

Similar News

News October 20, 2025

మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాలు

image

ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్‌ 8 కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 14 వరకు అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 24లోపు దరఖాస్తు హార్డ్ కాపీ, డాక్యుమెంట్స్‌ను పోస్ట్ చేయాలి. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంసీఏ, బీఎస్సీ, డిప్లొమా, LLB, బయో మెడికల్ ఇంజినీరింగ్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.aiimsmangalagiri.edu.in/

News October 20, 2025

దీపావళి: మీ ప్రాంతంలో ‘పేనీలు’ తింటారా?

image

దీపావళి అనగానే అందరికీ లక్ష్మీ పూజ, పటాసులే గుర్తొస్తాయి. కానీ తెలంగాణలో కొన్ని ఏరియాల్లో దీపావళి అంటే ‘పేనీలు’ తినాల్సిందే! అవును, ఈ స్వీట్‌ను ఎంతో ఇష్టంతో తినేవారు చాలామంది ఉంటారు. అమ్మవారికి కూడా ఇష్టమైన ఈ తీపి పదార్థాన్ని ముందుగా నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత వేడి పాలల్లో కలుపుకొని ఆరగిస్తారు. కొందరు టీలో కూడా వేసుకుంటారు. స్వర్గీయమైన రుచిగా చెప్పే ఈ ఆచారం మీ ప్రాంతంలో ఉందా? COMMENT

News October 20, 2025

VJD మెథడ్ అంటే ఏంటి?

image

క్రికెట్ మ్యాచ్‌కు అంతరాయం కలిగినప్పుడు ఓవర్లు కుదించేందుకు, టార్గెట్ రివైజ్ చేసేందుకు డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్(DLS) మెథడ్ ఉపయోగించడం తెలిసిందే. దీనికి బదులుగా వి.జయదేవన్ తన పేరుతో <<18055833>>VJD<<>> మెథడ్ కనిపెట్టారు. ఇందులో సాధారణ అంచనాతో పాటు మ్యాచ్ రీస్టార్ట్ అయ్యాక బ్యాటర్లు దూకుడుగా ఆడే అంశాన్నీ పరిగణించి టార్గెట్ సెట్ చేస్తారు. ఓవర్లు, వికెట్లతో పాటు రియల్ మ్యాచ్ కండీషన్స్‌నూ అంచనా వేసేలా డిజైన్ చేశారు.