News October 20, 2025
ఉరవకొండలో ఆ రోజు.. దేవుడు మాట్లాడారు!

పుట్టపర్తి సత్యసాయి బాబా 1940 అక్టోబర్ 20న ఉరవకొండలో తన అవతారాన్ని ప్రకటించారు. అబ్కారీ బంగ్లా సమీపంలోని రాతి గుండుపై కూర్చొని ‘నేను సత్యనారాయణుడు కాదు, సత్యసాయిని’ అని ప్రకటించారు. ఆ ప్రదేశంలో డా.నలబాల ఆంజనేయులు 2003లో భజన మందిరం నిర్మించారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 20న అక్కడ రథోత్సవం జరుగుతుంది. అవతార ప్రకటన తర్వాత సత్యసాయి బాబా పుట్టపర్తిలో ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను కొనసాగించారు.
Similar News
News October 20, 2025
పెద్దపల్లి: ప్రజలకు కలెక్టర్ DIWALI WISHES

దీపావళి సందర్భంగా టపాకాయలు కాల్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలని PDPL కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదివారం సూచించారు. అగ్ని ప్రమాదాలు, గాయాలు సంభవిస్తే వెంటనే సమీప అగ్నిమాపక కేంద్రానికి లేదా 101ను సంప్రదించాలని ఆయన కోరారు. చిన్నపిల్లలు పటాకులు కాల్చేటప్పుడు పెద్దలు దగ్గర ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని, పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు దీపావళి విషెస్ చెప్పారు.
News October 20, 2025
రోజుకు 213 మందికి జన్మనిస్తున్న హైదరాబాద్

హైదరాబాద్.. మహానగరం దాదాపు కోటి మంది జనాభా ఉన్న సిటీ.. ఇక్కడ రోజూ వందలాది మంది పురుడుపోసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కువ జనభ ఉన్న నగరంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన CRS (సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం) నివేదికలో తేలింది. 2023వ సంవత్సరంలో సిటీలో 76,740 మంది జన్మించారు. అంటే సగటున నెలకు 6,395 మంది.. రోజుకు 213 మంది ఈలోకాన్ని చూశారన్న మాట.
News October 20, 2025
నగరంలో దీపావళిపై ఆర్టిఫిషియల్ వెలుగులు

దీపావళికి మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించే ఆచారం ఇప్పుడు నగరంలో తగ్గుముఖం పడుతోంది. కోఠి, అబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్, బాలానగర్, కూకట్‌పల్లి, బేగంబజార్‌లో విక్రయిస్తున్న ఆర్టిఫిషియల్ లైట్లే ఆకర్షిస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో లభించే వివిధ ఆకృతుల దీపాలతో ఇళ్లు అలంకరిస్తున్నారు. మట్టి ప్రమిద అజ్ఞానం తొలగించి జ్ఞాన వెలుగు ప్రసరింపజేయాలనే భావనతో వచ్చిన సంప్రదాయంగా పెద్దలు చెబుతున్నారు.