News October 20, 2025
కేయూ: ఎంబీఏ, ఎంసీఏ స్పాట్ అడ్మిషన్స్

కేయూ పరిధిలోని స్కూల్ ఆఫ్ లర్నింగ్ (కేయూఎస్ఎల్)లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు SDLCE డైరెక్టర్, కేయూఎస్ఎల్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి.సురేష్ తెలిపారు. అర్హత, ఆసక్తి కల్గిన అభ్యర్థులు స్పాట్ అడ్మిషన్ల కోసం అక్టోబరు 21వ తేదీన SDLCEలో సంప్రదించాలని కోరారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీటు రాని అభ్యర్థులు అడ్మిషన్లు పొందవచ్చునని చెప్పారు.
Similar News
News October 20, 2025
తాజా సినీ ముచ్చట్లు!

* మెగాస్టార్ చిరంజీవి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. సైకిల్ తొక్కుతూ వింటేజ్ లుక్‌లో కనిపించారు.
*ధనుష్ నటించిన ‘సార్’ సినిమా కోసం తాను మొదట రవితేజను సంప్రదించినట్లు డైరెక్టర్ వెంకీ అట్లూరి తెలిపారు. బిజీ షెడ్యూల్ వల్ల కుదరలేదని వెల్లడించారు.
* శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి తెరకెక్కిస్తోన్న సినిమాకు ‘బైకర్’ టైటిల్ ఖరారు.
News October 20, 2025
జగిత్యాల: జిల్లా ప్రజలకు SP DIWALI WISHES

జగిత్యాల జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి ఎస్పీ అశోక్ కుమార్ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి ఆనందం, వెలుగుల పండుగగా సంతోషంగా జరుపుకోవాలని, బాణాసంచా కాల్చేటప్పుడు తప్పనిసరిగా భద్రతా నియమాలు పాటించాలని SP సూచించారు. చిన్నారులు తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పటాకులు కాల్చాలని, ప్రమాదకరమైన బాణాసంచా వాడకూడదని కోరారు. ప్రజల భద్రత కోసం పోలీసులు ప్రత్యేకంగా విధులు నిర్వర్తించనున్నట్లు తెలిపారు.
News October 20, 2025
HYD: బాలుడి చేతిలో బ్యాగ్.. అందులో బుల్లెట్

ప్రగతినగర్‌లో తల్లితో ఉంటున్న ఓ బాలుడు (12)ఇంట్లో ఉండటం ఇష్టం లేక మూసాపేట మెట్రో స్టేషన్‌కు బ్యాగుతో వచ్చాడు. సిబ్బంది తనిఖీ చేయగా షాక్‌కు గురయ్యారు. అందులో 9MM బుల్లెట్ బయటపడటంతో మెట్రో స్టేషన్ ఇన్‌ఛార్జికి చెప్పారు. కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. గతంలో బాలుడి తాత మిలిటరీలో పనిచేసి బుల్లెట్ ఇంట్లో ఉంచగా తెచ్చుకున్నాడని తేలింది. కేసు నమోదు చేసినట్లు SI గిరీష్ తెలిపారు.