News October 20, 2025

దీపావళి రోజున వీటిని చూస్తే అదృష్టమట

image

దీపావళి పర్వదినాన కొన్ని ప్రత్యేక సంకేతాలు అదృష్టాన్ని, లక్ష్మీ అనుగ్రహాన్ని సూచిస్తాయని పండితులు చెబుతున్నారు. మహాలక్ష్మి వాహనమైన గుడ్లగూబను చూస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోయి, సంపద వృద్ధి చెందుతుందని అంటున్నారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర పువ్వును చూస్తే ధనవృద్ధి ఉంటుందంటున్నారు. కాకి కనిపించడం పూర్వీకుల ఆశీస్సులతో సమానమట. వీటితో పాటు ఆవులు, బల్లులను చూడటం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు.

Similar News

News October 20, 2025

ONGCలో 566 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

image

ONGC 566 గ్రాడ్యుయేట్, డిప్లొమా ఇంజినీర్ పోస్టులకు సంబంధించి అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు <>www.iocl.com<<>> వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 31న పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 100 మార్కులకు డొమైన్ లాంగ్వేజ్, జనరల్ ఆప్టిట్యూడ్(క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లిష్ వెర్బల్ ఎబిలిటీ‌)పై పరీక్ష ఉంటుంది.

News October 20, 2025

ఈ ‘ట్రాప్స్’తో పంటకు రక్షణ, దిగుబడికి భరోసా

image

వ్యవసాయంలో ప్రకృతి వైపరిత్యాల కంటే ఎక్కువ నష్టం చీడపీడల వల్లే జరుగుతుంది. వీటి నివారణకు లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు, లైట్ ట్రాప్స్, విషపు ఎరలు వంటివి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి పురుగులను ఆకర్షించి, నిర్మూలించి వాటి ఉద్ధృతి, సంతతి పెరగకుండా కట్టడి చేస్తున్నాయి. వీటిని వినియోగించడం వల్ల రసాయన పురుగు మందుల వినియోగం తగ్గడమే కాకుండా, పర్యావరణానికి, మిత్రపురుగులకు ఎలాంటి హానీ కలగదు.

News October 20, 2025

తాజా సినీ ముచ్చట్లు!

image

* మెగాస్టార్ చిరంజీవి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. సైకిల్‌ తొక్కుతూ వింటేజ్ లుక్‌లో కనిపించారు.
*ధనుష్‌ నటించిన ‘సార్’ సినిమా కోసం తాను మొదట రవితేజను సంప్రదించినట్లు డైరెక్టర్ వెంకీ అట్లూరి తెలిపారు. బిజీ షెడ్యూల్ వల్ల కుదరలేదని వెల్లడించారు.
* శర్వానంద్ హీరోగా అభిలాష్‌ రెడ్డి తెరకెక్కిస్తోన్న సినిమాకు ‘బైకర్’ టైటిల్‌ ఖరారు.