News October 20, 2025
బాపట్ల: GST ముగింపు సమావేశంలో కలెక్టర్ ఫ్యామిలీ

బాపట్ల టీటీడీ కళ్యాణ మండపంలో ఆదివారం సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ ముగింపు సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ వినోద్ కుమార్ ఆయన సతీమణి భూమిక చంద్రలాలి పాల్గొన్నారు. సమావేశంలో బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మాట్లాడుతూ.. సామాన్య ప్రజల కొనుగోలు శక్తి పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 సంస్కరణలు చేపట్టిందన్నారు. జీఎస్టీ 4 స్లాబ్‌లు ఉన్న విధానాన్ని 2 స్లాబ్‌లకు తీసుకురావడంజరిగిందన్నారు.
Similar News
News October 20, 2025
HYD: రేపు దీపక్‌రెడ్డి నామిషన్ ర్యాలీకీ ప్రముఖులు

జూబ్లీహిల్స్ బైపోల్‌లో బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్‌రెడ్డి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. యూసఫ్‌గూడ హైలంకాలనీ నుంచి షేక్‌పేట్ తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఇప్పటికే గోవా సీఎం ప్రమోద్ హాజరుకానున్నట్టు ధ్రువీకరించగా, అస్సాం, మహారాష్ట్ర సీఎంల కన్ఫర్మేషన్ కోసం టీబీజేపీ వెయిటింగ్.
News October 20, 2025
శ్రీకాకుళం మీదుగా స్పెషల్ ట్రైన్స్

అదనపు రద్దీని తగ్గించేందుకు భువనేశ్వర్-యశ్వంతపూర్-భువనేశ్వర్(02811/22) మధ్య స్పెషల్ ట్రైన్ ఈనెల 29వ తేదీ వరకు నడపనున్నట్లు తూర్పు ప్రాంత రైల్వే శాఖ జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విశాఖపట్నం-బెంగళూరు-విశాఖపట్నం(08581/82) మధ్య ఈనెల 30వ తేదీ వరకు రైళ్లు నడుస్తాయి. శ్రీకాకుళంరోడ్డు, పలాస స్టేషన్లతో పాటు రాజమండ్రి, విజయవాడ, నెల్లూరులో ఈ రైళ్లు ఆగుతాయి.
News October 20, 2025
నిజామాబాద్‌లో ఆ రోజు ఏం జరిగింది?

TG: ఓ కేసు విషయంలో కానిస్టేబుల్ ప్రమోద్ శుక్రవారం <<18056602>>రియాజ్‌ను<<>> పట్టుకుని బైకుపై PSకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. రియాజ్ తన దగ్గర ఉన్న కత్తితో ప్రమోద్ ఛాతిలో పొడిచి పారిపోయాడు. ఆ క్రమంలో ఓ ఎస్సైపైనా దాడికి పాల్పడ్డాడు. ప్రమోద్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. రియాజ్‌పై చైన్ స్నాచింగ్, దొంగతనాలు, గొడవల వంటి 60కి పైగా కేసులున్నాయి. నాలుగైదుసార్లు జైలుకెళ్లొచ్చాడు.