News April 8, 2024
ASF: ఇంట్లో ఉరేసుకుని యువతి సూసైడ్
రెబ్బెన మండలం పాసిగాం గ్రామానికి చెందిన రజిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రెబ్బెన ఏఎస్ఐ లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. పాసిగాం గ్రామానికి చెందిన శంకర్‌తో 2019లో రజితకు వివాహమైంది. పిల్లలు కలగడం లేదని శంకర్ మద్యం సేవించి తరుచూ రజీతను మానసికంగా వేధించేవాడు. దీంతో మనస్తాపానికి గురైన రజిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Similar News
News December 28, 2024
మంచిర్యాల: ఆన్‌లైన్ గేమ్‌లో మోసపోయిన ప్రభుత్వ ఉద్యోగి
ఆన్‌లైన్ గేమ్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగిని మోసగించిన కేసులో సాంకేతిక పరిజ్ఞానంతో మంచిర్యాల బస్టాండ్‌లో నిందితుడిని పట్టుకున్నట్లు సైబర్ క్రైమ్ PS SHO, DSP వెంకటరమణ తెలిపారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి రూ.1,36,96,290మోసపోయానని తమకు ఫిర్యాదు చేశాడన్నారు. దర్యాప్తు చేయగా నిందితుడు ఎక్సైజ్ కానిస్టేబుల్ మహమ్మద్ అబ్దుల్ నయీం అని తెలిసి అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
News December 28, 2024
బెల్లంపల్లి: హత్యకు ప్రయత్నించిన ఐదుగురి రిమాండ్
పాత పగలు మనసులో ఉంచుకొని పథకం ప్రకారం ఒకరిని హత్యకు ప్రయత్నించిన 5గురు నేరస్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు రూరల్ CIఅబ్సలుద్దీన్ తెలిపారు.CIవివరాల ప్రకారం..ఈనెల 24న బాధితుడు పురుషోత్తం కాగజ్ నగర్ నుంచి మంచిర్యాలకు కారులో వెళుతుండగా ముగ్గురిలో ఒక వ్యక్తి బెల్లంపల్లి వద్ద కారు ఆపి పురుషోత్తంను బండరాళ్లతో తలమీద బాది పారిపోయారు. నేడు తాండూరులో నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలించామన్నారు.
News December 28, 2024
MNCL: జిల్లాలో 61452.920 మె.టల ధాన్యం కొనుగోలు
మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు 61452.920 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అదనపు కలెక్టర్ మోతిలాల్ తెలిపారు. ఇందులో 18082.120 మె.టల సన్నలు ఉన్నట్లు పేర్కొన్నారు. నేటికీ రూ.76.23 కోట్లు 5,144 మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు పూర్తి చేసిన 69 కొనుగోలు కేంద్రాలను మూసివేయడం జరిగిందన్నారు. అకాల వర్షాలకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.