News October 20, 2025

ఖేడ్‌లో 21న ఉమ్మడి జిల్లా రగ్బీ ఎంపికలు

image

ఉమ్మడి మెదక్ జిల్లా బాలబాలికల అండర్-19 రగ్బీ ఎంపికలు ఈనెల 21న నారాయణఖేడ్‌లోని తహశీల్దార్ మైదానంలో నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం తెలిపారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని చెప్పారు. ఆసక్తిగల వారు బోనాఫైడ్, పదవ తరగతి మెమో, జనన ధ్రువీకరణ పత్రంతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు.

Similar News

News October 20, 2025

దండారి ఉత్సవాల్లో పాల్గొన్న ఆదిలాబాద్ ఎంపీ

image

గిరిజనుల దండారి ఉత్సవాల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ పాల్గొన్నారు. ఆదిలాబాద్‌లోని కొమరం భీమ్ కాలనీలో సోమవారం వేడుకలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమమే దండారి ఉత్సవాలు అన్నారు. ఈ కార్యక్రమంలో తాటి పెళ్లి రాజు, కనపర్తి చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు.

News October 20, 2025

HYD: రేపు దీపక్‌రెడ్డి నామిషన్‌ ర్యాలీకీ ప్రముఖులు

image

జూబ్లీహిల్స్ బైపోల్‌లో బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్‌రెడ్డి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. యూసఫ్‌గూడ హైలంకాలనీ నుంచి షేక్‌పేట్ తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఇప్పటికే గోవా సీఎం ప్రమోద్ హాజరుకానున్నట్టు ధ్రువీకరించగా, అస్సాం, మహారాష్ట్ర సీఎంల కన్ఫర్మేషన్ కోసం టీబీజేపీ వెయిటింగ్.

News October 20, 2025

రియాజ్ మృతిని ధ్రువీకరించిన DGP

image

TG: ఎన్‌కౌంటర్‌లో <<18056602>>రియాజ్<<>> మృతిని డీజీపీ శివధర్ రెడ్డి ధ్రువీకరించారు. ‘నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ ఇవాళ బాత్రూం కోసం వెళ్లి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. పోలీసుల నుంచి వెపన్ తీసుకుని రియాజ్ కాల్పులకు యత్నించాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడంతో రియాజ్ చనిపోయాడు’ అని డీజీపీ వెల్లడించారు.