News October 20, 2025
దేశంలో యూపీఐ ద్వారానే 85% డిజిటల్ చెల్లింపులు: RBI

ఇండియాలో 85శాతం డిజిటల్ చెల్లింపులు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. UPI దేశ డిజిటల్ ఎకానమీలో విప్లవమని వరల్డ్ బ్యాంక్, IMF సమావేశాల్లో పేర్కొన్నారు. ప్రతి నెలా 20 బిలియన్లకు పైగా ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయన్నారు. యూపీఐ కేవలం ఆర్థిక సాధనం మాత్రమే కాదని, సామాజిక, ఆర్థిక సమానత్వానికి సూచిక అని అభిప్రాయపడ్డారు. యూపీఐ పరిధి దేశాలు దాటిందని వివరించారు.
Similar News
News October 20, 2025
బత్తాయిలో తొడిమ కుళ్లు తెగులును ఎలా నివారించాలి?

తొడిమ కుళ్లు సోకి, రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. తెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా కార్బండిజం 1 గ్రాము కలిపి పిచికారీ చేయాలి. ప్రతి సంవత్సరం తొలకరిలో చెట్లలో ఎండుపుల్లలను కత్తిరించి నాశనం చేయాలి. శిలీంధ్రానికి ఆశ్రయమిచ్చే కలుపు మొక్కలను సమర్థవంతంగా అరికట్టేందుకు చెట్ల పాదుల్లో మల్చింగ్ పద్ధతిని అవలంబించాలి. తోటల్లో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
News October 20, 2025
ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం: డీజీపీ

TG: నిజామాబాద్‌లో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి డీజీపీ శివధర్ రూ.కోటి పరిహారం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. పదవీ విరమణ వరకు వచ్చే శాలరీ అందిస్తామని, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేయిస్తామన్నారు. పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ.16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8 లక్షల పరిహారాన్ని రేపు అమరవీరుల సభలో సీఎం ప్రకటిస్తారని వెల్లడించారు.
News October 20, 2025
రియాజ్ మృతిని ధ్రువీకరించిన DGP

TG: ఎన్‌కౌంటర్‌లో <<18056602>>రియాజ్<<>> మృతిని డీజీపీ శివధర్ రెడ్డి ధ్రువీకరించారు. ‘నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ ఇవాళ బాత్రూం కోసం వెళ్లి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. పోలీసుల నుంచి వెపన్ తీసుకుని రియాజ్ కాల్పులకు యత్నించాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడంతో రియాజ్ చనిపోయాడు’ అని డీజీపీ వెల్లడించారు.