News October 20, 2025
రాజన్న ఆలయ విస్తరణ పనులు పరిశీలించిన పీఠాధిపతి

ధర్మ విజయ యాత్రలో భాగంగా శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి మహా స్వామివారికి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చకులు ఆదివారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఠాధిపతి రాజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోటిలింగాల దర్శనం చేసుకున్నారు. ఆలయ విస్తరణ పనులు, అభివృద్ధి మ్యాప్‌లు పరిశీలించారు.
Similar News
News October 20, 2025
పాలమూరు: కురుమూర్తి జాతర.. ‘ఉద్దాల’ ఉత్సవం అంటే..!

ప్రసిద్ధ కురుమూర్తి బ్రహ్మోత్సవాలలో ‘ఉద్దాల’ ఉత్సవం ప్రధాన ఘట్టం. స్వామివారి పాదుకలనే ‘ఉద్దాలు’ అని పిలుస్తారు. వీటిని వడ్డెమాన్‌కి చెందిన దళితులు నియమ నిష్ఠలతో తయారు చేస్తారు. రాయలసీమ ప్రాంతం నుంచి సేకరించిన నాణ్యమైన ఆవు చర్మంతో వీటి తయారీ జరుగుతుంది. దీపావళి అమావాస్య నుంచి సుమారు 7 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ఉద్దాలతో తలపై కొట్టించుకుంటే పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.
News October 20, 2025
బత్తాయిలో తొడిమ కుళ్లు తెగులును ఎలా నివారించాలి?

తొడిమ కుళ్లు సోకి, రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. తెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా కార్బండిజం 1 గ్రాము కలిపి పిచికారీ చేయాలి. ప్రతి సంవత్సరం తొలకరిలో చెట్లలో ఎండుపుల్లలను కత్తిరించి నాశనం చేయాలి. శిలీంధ్రానికి ఆశ్రయమిచ్చే కలుపు మొక్కలను సమర్థవంతంగా అరికట్టేందుకు చెట్ల పాదుల్లో మల్చింగ్ పద్ధతిని అవలంబించాలి. తోటల్లో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
News October 20, 2025
పొన్నూరు: ఫొటో కోసం చీరలో రూ.1లక్ష పెట్టమన్నాడు.. చివరకు

పొన్నూరులో సినిమాను తలపించేలా ఘరానా మోసం జరిగింది. విద్యానిగర్‌లోని రాధాకృష్ణమూర్తి ఇంట్లో చొరబడిన దొంగ, బహుమతులు వచ్చాయని నమ్మించి, ఫొటో తీయడానికి లక్ష రూపాయల నగదును చీరలో పెట్టి ఉంచాలని చెప్పాడు. ఆ తర్వాత ఆ లక్ష తీసుకొని ఉడాయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ వీరా నాయక్ తెలిపారు.