News October 20, 2025
మరణంలోనూ వీడని బంధం.. ఒకేరోజు భార్యాభర్తల మృతి

నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణంలోని ఆరువేటి లక్ష్మీనారాయణ (85), వెంకట లక్ష్మమ్మ (80) దంపతులు ఒకే రోజు మరణించారు. 60ఏళ్ల వివాహ బంధంలో ఒకరికొకరు తోడుగా ఉన్న వారు అనారోగ్యం కారణంగా వారిద్దరూ ఆదివారం మృతి చెందారు. ఒకేరోజు ఇద్దరు చనిపోవడం వింతగా ఉందని, ఇలాంటి ఘటన మునుపెన్నడూ జరగలేదని గ్రామస్థులు తెలిపారు. మరణంలోనూ వీడని బంధంగా ఈ సంఘటన నిలిచిందని పేర్కొన్నారు. స్థానికులు నివాళి అర్పించారు.
Similar News
News October 20, 2025
బాబర్ పని అయిపోయిందా?

పాక్ క్రికెటర్ బాబర్ ఆజమ్ పేలవ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో 16 పరుగులకే ఔటయ్యారు. బాబర్ గత 75 ఇన్నింగ్సుల్లో ఒక్క ఇంటర్నేషనల్ సెంచరీ కూడా చేయలేదు. సొంతగడ్డపై జరిగిన టెస్టుల్లోనూ దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. గత 15 టెస్టు ఇన్నింగ్సుల్లో అతడి స్కోర్లు 24, 27, 0, 22, 31, 11, 30, 5, 8, 5, 1, 31, 23, 42, 16గా ఉన్నాయి. సగటు 18.40 కాగా హాఫ్ సెంచరీ కూడా బాదలేకపోయారు.
News October 20, 2025
NLG: టార్గెట్ రీచ్ అవుతారా..!

మద్యం షాపుల టెండర్లకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించినా మద్యం వ్యాపారుల నుంచి అంతగా స్పందన కానరావడం లేదు. జిల్లాలో 154 మద్యం దుకాణాలకు సర్కారు ఆశించిన దానికంటే తక్కువ సంఖ్యలో (4,620) దరఖాస్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది 155 దుకాణాలకు 7,057 దరఖాస్తులు వచ్చాయి. ఎలాగైనా టార్గెట్ చేరుకోవాలనే సంకల్పంతో ఎక్సైజ్ శాఖ క్షేత్రస్థాయిలో పావులు కదుపుతోంది.
News October 20, 2025
దగడలో అత్యధిక వర్షపాతం

వనపర్తి జిల్లాలోని 21 వర్షపాతం నమోదు కేంద్రాలలో ఆదివారం ఉదయం నుండి సోమవారం ఉదయం వరకు కేవలం రెండు కేంద్రాలలోనే వర్షపాతం నమోదైంది. అత్యధికంగా దగడలో 3.0 మిల్లీమీటర్లు, శ్రీరంగాపురంలో 2.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. మిగిలిన 19 కేంద్రాలలో 0.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.